మేడిగడ్డ బ్యారేజ్ ను తెలంగాణ మంత్రుల బృందం పరిశీలించింది. బ్యారేజీకి బుంగలు పడ్డ చోటును మంత్రులు పరిశీలించారు. అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రాజెక్టులో లోపాలన్ని మానవ తప్పిదాలేనని తెలిపారు. లోపాలపై నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. మరోవైపు.. మేడిగడ్డ కుంగడంతో రెండో పంటకు సాగునీటిపై సందిగ్ధత ఏర్పడిందని మంత్రి ఉత్తమ్ చెప్పారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఆలోచిస్తున్నాం.. మేడిగడ్డ పరిశీలనపై సీఎంకి రెండు.. మూడు రోజుల్లో నివేదిక ఇస్తామని…