కృష్ణపట్నంలో ఆనందయ్య మందు పంపిణీ పై సందిగ్ధత కొనసాగుతోంది. ఆనందయ్య మందు వలన ఎలాంటి ఇబ్బందులు లేవని ఆయూష్ కమిషనర్ రాములు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆనందయ్య తయారు చేస్తుంది నాటు మందుగా ప్రకటించారు. ఇదిలా ఉంటే, ఇవాళ ప్రభుత్వానికి ఆయూష్ నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. ఇవాళ ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో మరోసారి మందును ఆనందయ్య తయారు చేయనున్నారు. ఆనందయ్య మందుపై ఐసీఎంఆర్ స్పందన పై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఆయూష్, ఐసీఎంఆర్ నివేదికల ఆధారంగా ఆనందయ్య మందుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం…
ఇప్పుడు చర్చ మొత్తం కృష్ణపట్నంలో ఆనందయ్య అందిస్తున్న కరోనా ఆయుర్వేద మందుపైనే.. కరోనా రోగుల నమ్మకం, విశ్వాసం ఎలా ఉన్నా ఇప్పుడు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు దీనిపై ఫోకస్ పెట్టాయి.. ఈ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలుచేశారు ఏపీ వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్.. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆనందయ్య ఆయుర్వేద చికిత్సపై అధ్యయనం జరుగుతోందన్నారు.. కేంద్ర ఆయుష్ శాఖ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపామన్న ఆయన.. ఆయుష్ విభాగం అధ్యయనం చేయనుంది.. సోమవారం…
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ను అడ్డుపెట్టుకుని అందినకాడికి దండుకుంటున్నాయి ప్రైవేట్ ఆస్పత్రులు, ఇక, ఫార్మా కంపెనీల దందా చెప్పాల్సిన పనేలేదు.. ఈ తరుణంలో.. ఉచితంగా కరోనావైరస్‌కు ఆయుర్వేద మందు పంపిణీ చేస్తూ వార్తల్లో నిలిచారు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య.. పదులు, వందల్లో వచ్చేవారి సంఖ్య ఏకంగా వేలకు పెరిగిపోయింది.. దీంతో.. తాత్కాలికంగా మందు పంపిణీ నిలిపివేయాల్సిన పరిస్థితి. మరోవైపు.. ఆ మందులోని శాస్త్రీయతను తేల్చేపనిలోపడిపోయారు. ఆయుష్‌తో పాటు ఐసీఎంఆర్ కూడా రంగంలోకి దిగింది. కృష్ణపట్నంకు…
కరోనాకు చెక్ పెట్టేందుకు క్రమంగా కొత్త వ్యాక్సిన్లు, మందులు అందుబాటులోకి వస్తూనే ఉన్నాయి.. ఇప్పటికే భారత రక్షణ సంస్థ డీఆర్డీవో భాగస్వామ్యంతో కోవిడ్ బాధితుల చికిత్స కోసం 2డీజీ డ్రగ్ ను తయారు చేయగా.. తాజాగా.. 2డీజీ డ్రగ్‌ను డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ఆవిష్కరించింది. పౌడర్ రూపంలో ఉండే సాచెట్‌ను విడుదల చేసింది డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్.. 10వేల మోతాదుల మొదటి బ్యాచ్‌ను వచ్చే వారంలో అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఈ సందర్భంగా వెల్లడించారు. ఇక, 2-డియోక్సీ-డీ-గ్లూకోజ్ (2-డీజీ)…