భారత దేశంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఔషద మందుల ధరలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ(NPPA) ఔషధాల టోకు ధర సూచికలో వార్షిక సవరణలు చేసినట్లు సమాచారం.
మూలిగే నక్కమీద తాటిపండు పడ్డ చందంగా వరుసగా పెరుగుతున్న ధరలు సామాన్యుడి పాలిట శాపంగా మారుతున్నాయి. ధరల మాట వింటే సామాన్యుడు షాక్ అవుతున్నాడు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, గ్యాస్ , వంట నూనెల పెరుగుదలలో సామాన్యులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వీటికి తోడు మెడిసిన్స్ ధరలు పెరుగుతుండడంతో కొనేదెలా అని కలవరపడుతున్నాడు. ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా అది చివరికి సామాన్యుడికి చుక్కలు చూపిస్తోంది. ఎక్కడో రష్యా-ఉక్రెయిన్ యుద్దం వల్ల ఇండియాలో వంట నూనెలు,…