Kotha Prabhakar Reddy Calls Medak Minister Useless: దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్‌లను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మెదక్ జిల్లాకి ఓ పనికి మాలిన మంత్రి ఉన్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంట్లో నుంచి బయటికి రాడని.. కమీషన్లు, పర్స౦టేజీల గురించి మాత్రమే పట్టించుకుంటాడని విమర్శించారు. జిల్లా మంత్రి ఒకరైతే.. జిల్లా మీద పెత్తనం…
గత నెల 27న వినాయక విగ్రహాల తయారీ వద్ద నుంచి కొందరు యువకులు గుట్టుచప్పుడు కాకుండా దొంగతనంగా ఓ ట్రాలీ వాహనంలో వినాయకుడి విగ్రహం పట్టుకెళ్లారు. ఈ ఘటన మెదక్ జిల్లా కేంద్రంలోని చంద్ర భవన్ కాంప్లెక్స్ లో జరిగింది. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కావడం తో విగ్రహం చోరీ విషయం వెలుగులోకి వచ్చింది.. మెదక్ పట్టణంలోని పిల్లికొట్టల్ వద్ద చంద్ర భవన్ కాంప్లెక్స్ లో సురేష్ ప్రతియేట గణనాధుల విగ్రహాలు తయారు చేసి…
గతంలో హిందువులను టెర్రరిస్టులుగా అప్పట్లో యూపీఏ సర్కార్ చూపించింది అని ఆరోపించారు. పాకిస్థాన్ ఏజెంట్ లుగా యూపీఏ నేతలు మారారు.. హిందువుల్లో ఐక్యత తక్కువగా ఉంటుందనే అధికారంలో ఉండే పార్టీలు ఇలా చేస్తున్నాయని పేర్కొన్నారు. జమ్మూకాశ్మీర్ లో ఆర్మీ సైనికులు తమ ప్రాణాలకు తెగించి పని చేస్తారు అని ఎంపీ రఘునందన్ రావు తెలిపారు.
మెదక్ జిల్లా చిన్నశంకరంపేట పెట్రోల్ పంప్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మద్యం మత్తులో రోడ్డు ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. నలుగురు యువకులు ఫ్రెండ్ బర్త్ డే కోసం ఎర్టీగా కారు రెంట్ కి తీసుకుని వెళ్లారని తెలిపారు. బర్త్ డే పార్టీలో మద్యం సేవించినట్లు వెల్లడించారు. Also Read:Kissing:…
Congress Leader Murder Case: మెదక్ జిల్లా కాంగ్రెస్ యువ నేత అనిల్ కుమార్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. ఈ హత్య కేసును ఛేదించడానికి నాలుగు స్పెషల్ టీంలను ఏర్పాటు చేశారు.
కొల్చారం (మం) వరిగుంతం గ్రామ శివారులో మెదక్ జిల్లా కాంగ్రెస్ ఎస్సి సెల్ జిల్లా సెక్రటరీ అనిల్ అనుమానాస్పద మృతి కలకలం రేపింది. మెదక్- జోగిపేట రోడ్డు పక్కన కారులో అనిల్(45) మృతదేహం పడి ఉంది. అటుగా వెళ్తున్న ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే అక్కడికి చేరుకుని ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఘటనాస్థలంలో నాలుగు బుల్లెట్లు లభ్యమయ్యాయి. మొదట రోడ్డు ప్రమాదం అని భావించిన పోలీసులు బుల్లెట్లు లభ్యం కావడంతో అనుమానం వ్యక్తం చేస్తున్నారు. Also Read:Promotions…
తెలంగాణ భవన్లో మెదక్ కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్బంగా కేటీఆర్ సీఎం రేవంత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. “సిద్దిపేట అంటే పందులు గుర్తుకు వచ్చేవి.. మెదక్ అంటే గాడిదలు గుర్తుకు వస్తాయని హరీష్ రావు చెప్పారు.. సిద్దిపేటలో పందులు మాయం అయ్యాయి కానీ మెదక్లో మాత్రం ఇంకా కొన్ని గాడిదలు ఉన్నాయి.. వాటి సంగతిని బీఆర్ఎస్ కార్యకర్తలు చూసుకుంటారు.. రేవంత్ రెడ్డికి కర్రు కాల్చి వాత పెట్టాల్సిన సమయం వచ్చింది. రేవంత్…
మెదక్ జిల్లాలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఒకటి మెదక్, రెండోది నర్సాపూర్. నర్సాపూర్ ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోట. తర్వాత హస్తం పార్టీ హవా నడిచిన సెగ్మెంట్. కానీ... గత మూడు విడతల నుంచి బీఆర్ఎస్ విజయ పరంపర కొనసాగుతోంది. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇక్కడ కాంగ్రెస్ సమీకరణలు మారిపోయాయి. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న కంఠారెడ్డి తిరుపతి రెడ్డి మెదక్ అసెంబ్లీ టికెట్ ఆశించారు.
ఏ పని చేయకుండా అవసరాలు తీర్చుకోవడం కోసం దొంగతనాలను ఎంచుకుంటున్నారు కొందరు వ్యక్తులు. చైన్ స్నాచింగ్స్, ఇళ్లలో చోరీలు చేస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారు. పురుషులతో పాటు కొందరు మహిళలు కూడా దొంగతనాలకు పాల్పడుతున్నారు. అయితే తాజాగా ఓ విచిత్ర దొంగల బండారం బయటపడింది. సహజీవనం చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు దొంగ ప్రేమికులు. ఈజీ మనీకి అలవాటు పడి దొంగతనాలను వృత్తిగా ఎంచుకుని చోరీలు చేస్తున్నారు కిలాడి కపుల్స్. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. Also…