Turmeric Stains Remove Tips: బట్టలపై పసుపు మరకలతో ఇబ్బందా? ఈ చిట్కాలతో నిమిషాల్లో శుభ్రం చేసుకోండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Turmeric Stains Remove Tips: తినేటప్పుడు లేదా వంట చేసేటప్పుడు కూరలు, పప్పులు, పసుపు కలిగిన ఆహారం బట్టలపై పడటం సాధారణమే. ముఖ్యంగా తెలుపు, క్రీమ్ లేదా లేత రంగు దుస్తులపై పసుపు మరకలు పడితే వాటిని తొలగించడం చాలా కష్టంగా అనిపిస్తుంది. మరకలు పోవాలని గట్టిగా రుద్దితే బట్టలోని దారాలు దెబ్బతిని, ఖరీదైన దుస్తులు కూడా పాడయ్యే ప్రమాదం ఉంటుంది. ఇక, తెలంగాణలో బోనాల సీజన్ ప్రారంభం అయ్యింది.. బోనాలు అంటేనే పసుపు మయం ఉంటుంది.. బోనాలు ఎత్తుకునేవారికి.. ముందు ఉండేవారికి.. ఆడేవారికి.. అందరికీ పసుపు మరకలు అంటుతాయి.. అయితే మీ వంటగదిలోనే ఉండే కొన్ని సాధారణ పదార్థాలతో ఈ మొండి మరకలను సులభంగా తొలగించవచ్చు.
1. నిమ్మకాయ + బేకింగ్ సోడా
మరక ఉన్న చోట ఒక టీస్పూన్ బేకింగ్ సోడా చల్లి, దానిపై అర నిమ్మకాయ రసం పిండండి. నురుగు వచ్చిన తర్వాత పాత టూత్‌బ్రష్ లేదా చేతితో 2–3 నిమిషాలు మెల్లగా రుద్దండి. 10 నిమిషాలు అలాగే ఉంచి, తర్వాత సాధారణ నీటితో కడిగితే మంచి ఫలితం కనిపిస్తుంది.
Also Read
- World Savings Day : నెలాఖరుకు చేతిలో డబ్బు ఉండాలంటే ఇలా చేయండి!
- Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
- Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
- Cauliflower Quality Test: క్యాలీఫ్లవర్లో పురుగులు ఉన్నాయో లేదో ఇలా తెలుసుకోండి.. కోయకుండానే కనిపెట్టొచ్చు..
2. తెల్ల వెనిగర్ + ద్రవ డిటర్జెంట్
ఒక గిన్నెలో రెండు టీస్పూన్ల తెల్ల వెనిగర్, ఒక టీస్పూన్ ద్రవ డిటర్జెంట్ కలపండి. ఈ మిశ్రమాన్ని మరకపై రాసి 15–20 నిమిషాలు ఉంచండి. అనంతరం గోరువెచ్చని నీటితో ఉతికితే పసుపు మరకలు తగ్గుతాయి.
3. హైడ్రోజన్ పెరాక్సైడ్ + డిష్‌వాషింగ్ లిక్విడ్
తెలుపు లేదా లేత రంగు దుస్తులపై ఉన్న మరకలకు కొన్ని చుక్కల హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను డిష్‌వాషింగ్ లిక్విడ్‌తో కలిపి రాయండి. 10 నిమిషాల తర్వాత కడిగేయండి. అయితే ఈ పద్ధతిని రంగు దుస్తులపై ఉపయోగించకూడదు, ఎందుకంటే రంగు వెలిసే అవకాశం ఉంటుంది.
4. తెల్లటి టూత్‌పేస్ట్
జెల్ కాని తెల్లటి టూత్‌పేస్ట్‌ను నేరుగా మరకపై రాసి తేలికగా రుద్దండి. అది పూర్తిగా ఆరిన తర్వాత చల్లటి నీరు, డిటర్జెంట్‌తో ఉతికితే మరక తగ్గుతుంది.
5. ఎండలో ఆరబెట్టండి
ఈ పద్ధతుల్లో ఏదైనా ఉపయోగించి దుస్తులను ఉతికిన తర్వాత వాటిని నేరుగా ఎండలో ఆరబెట్టండి. పసుపులో ఉండే కర్కుమిన్ అనే పదార్థం సూర్యకాంతిలోని అతినీలలోహిత (UV) కిరణాల ప్రభావంతో క్రమంగా విచ్ఛిన్నమై, మిగిలిన పసుపు రంగు కూడా తగ్గిపోతుంది.
ఈ సులభమైన చిట్కాలను పాటించడం ద్వారా ఖరీదైన దుస్తులను దెబ్బతీయకుండా మొండి పసుపు మరకలను తొలగించవచ్చు. అయితే ముందుగా దుస్తుల లోపలి చిన్న భాగంలో పరీక్షించి, తర్వాత మొత్తం మరకపై ఉపయోగించడం మరింత సురక్షితం.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. నగరిలో అత్యధిక పోలింగ్!
-
State Election Commissioner: ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోండి: ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
-
AP Municipal Elections 2026: ఏపీలో 8.39 శాతం ఓటింగ్.. నగరిలో అత్యధిక పోలింగ్!
-
CJP: మద్దతు ఇస్తాం, కానీ పాల్గొనబోం.. ప్రతిపక్షాల ర్యాలీపై అభిజిత్ దీప్కే..
-
UP Elections: 350 స్థానాలు.. యూపీలో బీజేపీ టార్గెట్ ఫిక్స్..
-
Commercial LPG Price Hike: దీపావళికి ముందు షాక్.. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!