RRB JE Recruitment 2026: రైల్వేలో 4,098 జూనియర్ ఇంజనీర్ పోస్టులు.. ఆగస్టు 14 నుంచి దరఖాస్తులు
- రైల్వేలో 4,098 జూనియర్ ఇంజనీర్ పోస్టులు
- 2026 ఆగస్టు 14 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు
- వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 33 సంవత్సరాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ రైల్వేలో ఉద్యోగం చేయాలని కలలు కంటున్న ఇంజనీరింగ్ అభ్యర్థులకు శుభవార్త. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) దేశవ్యాప్తంగా 4,098 జూనియర్ ఇంజనీర్ (JE) పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించనుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 2026 ఆగస్టు 14 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే చివరి తేదీ 2026 సెప్టెంబర్ 13గా నిర్ణయించారు.
మొత్తం ఎన్ని పోస్టులు?
ఆర్ఆర్బి విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, దేశవ్యాప్తంగా మొత్తం 4,098 జూనియర్ ఇంజనీర్ (JE) పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా ఖాళీలు, విద్యార్హతలు, జోన్ల వారీ వివరాలు త్వరలో విడుదలయ్యే డీటైల్డ్ నోటిఫికేషన్లో వెల్లడించనున్నారు.
Also Read
- Success Story: యూపీఎస్సీ కోసం 16 ప్రభుత్వ ఉద్యోగాలను తిరస్కరించింది.. కట్ చేస్తే ఐపీఎస్..
- Central Government Jobs: జేన్ జీకి ఈ మూడు ప్రభుత్వ ఉద్యోగాలంటే ఎందుకంత పిచ్చి? ఆసక్తికర విషయాలు..
- IBPS RRB 2026: నిరుద్యోగులకు అలర్ట్.. 13,441 బ్యాంక్ ఉద్యోగాలు.. IBPS RRB దరఖాస్తులకు రేపే చివరి తేదీ
- Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
వయోపరిమితి
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కనీస వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 33 సంవత్సరాలు ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది. SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
జీతం ఎంత?
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 7వ వేతన సంఘం (7th CPC) ప్రకారం లెవల్-6 పే స్కేల్లో నెలకు రూ.35,400 ప్రారంభ మూల వేతనం లభిస్తుంది. అదనంగా డీఏ, హెచ్ఆర్ఏ, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ వంటి ఇతర భత్యాలు కూడా వర్తిస్తాయి.
దరఖాస్తు ప్రక్రియ
RRB JE Recruitment 2026 కోసం దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లో ఉంటుంది. దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ఈ దశలను అనుసరించాలి.
ముందుగా RRB అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
హోమ్‌పేజీలో కనిపించే RRB JE Recruitment 2026 లింక్‌పై క్లిక్ చేయండి.
కొత్తగా రిజిస్ట్రేషన్ చేసి, లాగిన్ అవ్వండి.
దరఖాస్తు ఫారంలో అడిగిన వ్యక్తిగత, విద్యార్హత వివరాలను జాగ్రత్తగా నమోదు చేయండి.
అవసరమైన పత్రాలు, ఫోటో, సంతకం స్కాన్ కాపీలను అప్లోడ్ చేయండి.
దరఖాస్తు రుసుము (వర్తిస్తే) చెల్లించి ఫారాన్ని సమర్పించండి.
భవిష్యత్తు అవసరాల కోసం దరఖాస్తు ఫారమ్ ప్రింట్అవుట్ను భద్రపరచుకోండి.
తాజావార్తలు
-
Submarine Deal: భారత్ ‘ఓకే’ అంటే సముద్రంలో శత్రువుల పని ఖతమే .. రూ. 90 వేల కోట్ల మెగా డీల్‌కు జర్మనీ సై..
-
POK: పీఓకేను శ్మశానంగా మార్చారు.. UNలో గర్జించిన కాశ్మీర్ మహిళ..
-
Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాక రైతాంగం కన్నీళ్లు పెడుతోంది
-
Paradise First Review: థియేటర్లు బ్లాస్ట్.. ‘ది ప్యారడైజ్’ లాస్ట్ 40 నిమిషాలు నాని ర్యాంపేజ్.. ఆ పాపులర్ హీరో సర్ ప్రైజ్ క్యామియో!
-
Cabinet Key Decisions: అమరావతికి కొత్త రూపు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. కొత్త ఎక్సైజ్ విధానం..
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!