CM Revanth: విద్యార్థులపై దాడులు అమానుషం.. నీట్ వ్యవహారంపై కేంద్రంపై సీఎం రేవంత్ ఫైర్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా కొడంగల్ అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. భారీ ర్యాలీగా అక్కడికి చేరుకున్న సీఎం, కాంగ్రెస్ శ్రేణులతో కలిసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టును ఖండిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. నీట్ (NEET) పరీక్షల వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. “నీట్ పరీక్షలను పల్లీ బఠాణీల మాదిరిగా అమ్మేశారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం చెలగాటం ఆడింది” అని మండిపడ్డారు.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా విద్యార్థులు తమ హక్కుల కోసం ఉద్యమించారని, అలాంటి విద్యార్థులపై పాశవికంగా దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని సీఎం అన్నారు. వందలాది మంది విద్యార్థులు గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని, మరికొందరు అదృశ్యమయ్యారని పేర్కొన్నారు. వారి తరఫున పోరాడేందుకు రాహుల్ గాంధీ ముందుకు వచ్చారని అన్నారు. నీట్ అంశంపై పార్లమెంట్లో చర్చ జరగకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ ఒత్తిడికి లోనైన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఈ అంశంపై చర్చకు అవకాశం ఇవ్వలేదని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేయడం ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కు అని స్పష్టం చేశారు.
దేశ ప్రజల కోసం త్యాగాలు చేయడం గాంధీ కుటుంబానికి కొత్త కాదని సీఎం అన్నారు. రాహుల్ గాంధీ పదేళ్ల పాటు ప్రతిపక్ష నేత హోదా తీసుకోలేదని, రాజ్యాంగ విలువలను కాపాడాలనే ఉద్దేశంతోనే తర్వాత ఆ బాధ్యతను స్వీకరించారని వ్యాఖ్యానించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా ఇంటర్ ఫలితాల్లో అవకతవకలు జరిగాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆ సమయంలో జరిగిన తప్పిదాల కారణంగా 27 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. అదే సంస్థ తర్వాత CBSE పరీక్షల మూల్యాంకన కాంట్రాక్టును కూడా పొందిందని ఆరోపించారు.
నీట్ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఒకవేళ ఆయన్ను తొలగించకపోతే ఈ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీనే బాధ్యత వహించాలని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును కాపాడే చర్యలు తీసుకోవాలని కోరారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!