Indonesia: ఇండోనేషియా ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం-మెజారిటీ దేశం, 270 మిలియన్లకు పైగా ప్రజలు ఉన్నారు. ప్రస్తుతం ఆ దేశంలోని మధుర ద్వీపంలో తొమ్మిది నెలలుగా మీజిల్స్(తట్టు వ్యాధి) వ్యాప్తి కొనసాగుతోంది. ఈ సంవత్సరం, 2,600 కంటే ఎక్కువ మంది పిల్లలు ఈ వ్యాధి బారిన పడ్డారు. అందులో 20 మంది మరణించారు. మహమ్మారిని అరికట్టడంలో సహాయపడటానికి ఆరోగ్య కార్యకర్తలు సుమెనెఫ్ జిల్లాకు వ్యాక్సిన్‌లను పంపిణీ చేస్తున్నారు.