ట్రంప్ నిర్ణయం భారతీయ వృత్తి నిపుణులపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. H-1B వీసా హోల్డర్లలో 70 శాతం మంది ఇండియన్స్ ఉన్నారు. ట్రంప్ నిర్ణయంపై భారత్ స్పందించింది. ఒక ప్రకటనలో ‘‘H-1B వీసా ఫీజు పెంపు చాలా కుటుంబాలకు ఇబ్బంది కలిగించే విధంగా మానవతా పరిణామాలను కలిగిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. అమెరికా అధికారులు ఈ విషయాన్ని పరిష్కరిస్తారని ప్రభుత్వం ఆశిస్తున్నట్లు కూడా పేర్కొంది.’’ అని తెలిపింది.