మావోయిస్టుల చేతిలో హతం అయిన మాజీ సర్పంచ్ రమేష్ డెడ్ బాడీ అప్పగింతపై సందిగ్దత ఏర్పడింది. ఛత్తీస్ ఘడ్-తెలంగాణ సరిహద్దులో మావోయిస్టుల చేతిలో హతం అయిన రమేష్ మృతదేహం ఇంకా అక్కడే వుంది. మృతదేహం తరలింపులో వివాదం రేగింది. అది మా పరిధి కాదంటే మా పరిధి కాదంటూ రెండు రాష్ట్రాల పోలీసు దాటవేయడం వివాదాస్పదం అవుతోంది.
Read Also :బ్రేకింగ్ : కిడ్నాప్ చేసిన మాజీ సర్పంచ్‌ను హత్య చేసిన మావోయిస్టులు
మావోయిస్టులు పడేసిన చోటనే రమేష్ మృతదేహం వుంది. అతని బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రమేష్ తెలంగాణ వ్యక్తి కావడంతో తెలంగాణ పోలీసులు స్వాధీనం చేసుకోవాలంటున్నారు బంధువులు. తెలంగాణ పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతోనే మావోయిస్టులు చంపారని అది మా పరిధిలోకి రాదని మీరే చూసుకోవాలని అంటున్నారు ఛత్తీస్ ఘడ్ పోలీసులు. టెక్నికల్ గా మీ పరిధిలో సంఘటన జరిగింది కాబట్టి కేసు ఛత్తీస్ ఘడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేసి మృత దేహం ఇవ్వాలంటున్నారు తెలంగాణ పోలీసులు. కుటుంబ సభ్యులు మాత్రం రమేష్ డెడ్ బాడీ వెంటనే తమకు అప్పగించాలని కోరుతున్నారు.