జగిత్యాల జిల్లా నుంచి మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ పార్టీని, ముఖ్యంగా గత ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శించారు. 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యారంగం పట్ల సరైన దృష్టి ఇవ్వలేదని, విద్యారంగం పూర్తిగా నిర్వీర్యమైపోయిందని ఆమె పేర్కొన్నారు. ఆమె మాట్లాడుతూ.. ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం విద్యారంగాన్ని గాడిలో పెట్టేందుకు, విద్యా రంగాన్ని పునరుద్ధరించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు.