T20 World Cup: ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు మాథ్యూ హేడెన్ మరోసారి పాకిస్థాన్ జట్టుకు మెంటార్‌గా నియమితుడయ్యాడు. గత ఏడాది మాదిరిగానే పాకిస్థాన్ టీం మేనేజ్ మెంట్ టీ20 ప్రపంచకప్ మాథ్యూ హేడెన్‌ను సహాయక సిబ్బందిగా నియమించుకుంది. ప్రధాన కోచ్ సక్లైన్ ముస్తాక్, ఇతరులతో కలిసి మెంటార్ బాధ్యతలను హేడెన్ పోషించనున్నాడు. రెండుసార్లు ప్రపంచకప్ గెలిచిన జట్టులో క్రికెటర్ అయిన హేడెన్.. బ్రిస్బేన్‌లో అక్టోబర్ 15న పాకిస్థాన్ జట్టుతో చేరనున్నాడు. ఈసారి టీ20 వరల్డ్ కప్ ఆస్ట్రేలియాలో…
ఒకప్పుడు వన్డేల్లో డబుల్ సెంచరీ చేయడమన్నది గగనం. కానీ, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. తొలిసారి డబుల్ సెంచరీ చేసి, అంతర్జాతీయ క్రీడల్లో ఆ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా చరిత్రపుటలకెక్కాడు. ఆ తర్వాత పలువురు క్రికెటర్లు 200 పరుగుల మైలురాయిని అందుకున్నారు. అయితే, ఇప్పుడు ఓ క్రికెటర్ ఏకంగా ట్రిపుల్ సెంచరీ బాది చరిత్ర సృష్టించాడు. అవును, మీరు చదువుతోంది అక్షరాల నిజం. అది కూడా ఓ అంధ క్రికెటర్.…