China: చైనా ఆర్థిక వ్యవస్థ గతంలో ఎప్పుడూ చూడని విధంగా తీవ్రమై ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. బయటకు కనిపించకపోయినా చైనా ఆర్థిక వ్యవస్థ డొల్లగా మారిందని ప్రపంచ ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కరోనా తర్వాత నుంచి ఆ దేశంలో ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో ఉంది. ఇదిలా ఉంటే చైనాలో యువత పెళ్లిళ్లకు మొగ్గు చూపకపోవడం ఆ దేశాన్ని కలవరపరుస్తోంది.