అనంతపురం జిల్లా ధర్మవరం లోని కూరగాయల మార్కెట్ ను పరిశీలించారు టీడీపీ ధర్మవరం ఇన్‌ఛార్జ్ పరిటాల శ్రీరాం, హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు బీకే పార్థసారథి. ధర్మవరం నడిబొడ్డున ఉన్న కూరగాయల మార్కెట్ ను రాత్రికి రాత్రే కూల్చివేసిన మునిసిపల్ అధికారుల తీరుపై శ్రీరాం మండిపడ్డారు. మార్కెట్ సమస్యలు మార్కెట్ లో కాకుండా ఎమ్మెల్యే ఇంట్లో పరిష్కారిస్తున్నాడా..?అధికారులను ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి బంట్రోతుల్లా మార్కెట్ మీదకు వదిలాడు. అధికారులు ఎమ్మెల్యే కంట్రోల్ లో పని చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు.…
దేశీయ స్టాక్ మార్కెట్ల చరిత్రలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రధాన సూచీల్లో ఒకటైన సెన్సెక్స్ 60 వేల పాయింట్లను దాటి కొత్త చరిత్రను లిఖించింది. దీంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లలో ఓ తిరుగులేని శక్తిగా అవతరించింది. ఇప్పటికే ప్రపంచంలో ఆరో అతిపెద్ద మార్కెట్లుగా నిలిచిన భారత స్టాక్ మార్కెట్లు.. త్వరలోనే ఐదో స్థానానికీ ఎగబాకే అవకాశాలు కనిపిస్తున్నాయి. శుక్రవారం ఆరంభంలోనే 60,000 పాయింట్ల ఎగువన ప్రారంభమై చరిత్ర సృష్టించిన సెన్సెక్స్.. రోజంతా అదే జోరును కొనసాగింది. స్వల్పసమయం…
హైదరాబాదులో భారీ మోసం వెలుగు చూసింది. కార్లను అద్దెకు తీసుకొని బహిరంగ మార్కెట్లో అమ్ముకుంటుంది ఓ ముఠా. ప్రముఖ కంపెనీ నుంచి కారు లను అద్దెకు తీసుకున్న ముఠా… సబ్సిడీ కార్ల పేరుతోటి బహిరంగ మార్కెట్లో అమ్మేస్తుంది. ప్రభుత్వం నుంచి సబ్సిడీలో కార్లు వస్తున్నాయంటూ మోసం చేస్తుంది. హైదరాబాదులో పలు సంస్థల నుంచి కార్లను అద్దెకు తీసుకున్న ఆరుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసారు సైబర్ బాద్ పోలీసులు. ముఠా నుంచి 50 అత్యంత ఖరీదైన కార్లను…