మాలీవుడ్ స్టార్ హీరో మోహన్ లాల్ జోష్ అండ్ జోరును యంగ్ హీరోలు బీట్ చేయలేరేమో. 65 ఇయర్స్‌లో కూడా రెస్ట్ అనే పదాన్ని మర్చిపోయి బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు దించేస్తున్నారు. ఇప్పటికే ఈ ఏడాది L2 ఎంపురన్, తుడరుమ్, హృదయ పూర్వంతో హ్యాట్రిక్ హిట్ అందుకున్న లాలట్టన్. కన్నప్పలో క్యామియో రోల్‌తో మెప్పించారు. ఇప్పుడు ఫిప్త్ మూవీ వృషభను లోడ్ చేస్తున్నారు.అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోంది వృషభ. మోహన్ లాల్ ఇందులో కింగ్‌గా…
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘మరక్కార్’. ఈ పిరియడ్ వార్ బేస్డ్ మూవీ విడుదలకు ముందే మూడు జాతీయ అవార్డులను అందుకుంది. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ కాస్ట్యూమ్స్, బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ కేటగిరిల్లో అవార్డులను పొందింది. ప్రియదర్శన్ మలయాళంలో అత్యధిక చిత్రాలను మోహన్ లాల్ తోనే చేశాడు. అందులో అనేక చిత్రాలు ఘన విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో భారీ వ్యయంతో,…
మలయాళం సూపర్ స్టార్ నటించిన భారీ చిత్రం ‘మరక్కార్’. అరేబియా సముద్ర సింహం అనేది ఉప శీర్షిక. ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. మొదట ఈ చిత్రాన్ని డిసెంబర్ 2న విడుదల చేద్దామనుకున్నారు. కానీ డిసెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు, టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రియదర్శన్ తెరకెక్కిస్తోన్న ఈ ప్రాజెక్ట్‌ను తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్ భారీ ఎత్తున రిలీజ్ చేస్తోంది. ‘మరక్కార్’ సినిమా…
నందమూరి నట సింహం బాలకృష్ణ తాజా చిత్రం ‘అఖండ’ డిసెంబర్ 2వ తేదీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. విశేషం ఏమంటే… అదే రోజున మోహన్ లాల్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘మరక్కార్’ కూడా జనం ముందుకు వస్తోంది. సీనియర్ దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఆంటోని పెరంబువూర్ నిర్మించారు. Read Also : దుబాయ్ లో బన్నీ, ప్యారిస్ లో జూనియర్ ‘మరక్కార్’ మూవీ తెలుగు హక్కులను ప్రముఖ పంపిణీ సంస్థ సురేశ్ ప్రొడక్షన్స్…
గత యేడాది కరోనా ఫస్ట్ వేవ్ సమయంలోనూ జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేశ్ నటించిన రెండు సినిమాలు ‘పెంగ్విన్, మిస్ ఇండియా’ ఓటీటీలో విడుదల అయ్యాయి. థియేట్రికల్ రిలీజ్ కాకపోవడంతో అవి ఏ మేరకు కలెక్షన్లు వసూలు చేశాయనే విషయం చెప్పలేం. అయితే నిర్మాతలు మాత్రం మంచి లాభానికే ఓటీటీ సంస్థలకు ఆ చిత్రాలను అమ్మారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే… ఈ యేడాది మార్చిలో విడుదలైన ‘జాతి రత్నాలు’ చిత్రంలో కీర్తి సురేశ్…
మోహన్‌లాల్ నటించిన మల్టీస్టారర్ ‘మరక్కర్: అరబికడలింటే సింహం’ డిజిటల్ లోనే రాబోతోంది. డిసెంబర్ 2న ఈ భారీ బడ్జెట్ పీరియాడికల్ డ్రామా విడుదలకు రంగం సిద్ధం అయింది. ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2020 ప్రథమార్ధంలోనే థియేట్రికల్ రిలీజ్ కావలసి ఉంది. అయితే కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడింది. ఇటీవల ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల చేయటానికి నిర్ణయించారు. నిర్మాత ఆంథోనీ డైరెక్ట్ డిజిటల్ ని ధృవీకరించారు. మోహన్‌లాల్, ప్రియదర్శన్‌తో చర్చలు…
మోహన్‌లాల్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘మరక్కర్’.. లయన్ ఆఫ్ ది అరేబియన్ సీ అనేది టాగ్ లైన్.. ప్రియదర్శన్ దర్శకత్వం వహించారు. 16వ శతాబ్దం నేపథ్యంలో సాగే ఈ సినిమా ఇటీవల ప్రకటించిన జాతీయ పురస్కారాల్లో పలు విభాగాల్లో విజేతగా నిలిచింది. ఈ చిత్రం ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా.. కరోనావల్ల ఈ చిత్రం మరోసారి వాయిదా పడింది. మలయాళంతోపాటు తెలుగు, హిందీ తదితర భాషల్లో ఆగస్టు 12న ఈ చిత్రాన్ని అధికారికంగా విడుదల చేయాలనుకున్నట్లుగా పోస్టర్…
మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘మరక్కర్: లయన్ ఆఫ్ ది అరేబియన్ సీ’. ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేశ్, మంజు వారియర్, అర్జున్, కల్యాణీ ప్రియదర్శన్, ప్రణవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీలోని కీర్తి సూరేశ్ న్యూలుక్ బయటకు వచ్చింది. సంగీతకారిణిగా జీవితాన్ని మొదలుపెట్టి కేరళ యువరాణిగా పట్టాభిషిక్తురాలైన యువతిగా కీర్తి పాత్ర ఉండనున్నట్లు సమాచారం. ఒంటినిండా ఆభరణాలు ధరించి రాచరికపు కాలం నాటి…
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తున్న మాగ్నమ్ఓపస్ చిత్రం ‘మరక్కర్: అరబికడలింటే సింహామ్’. అభిమానులు చాలా కాలంగా ఈ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా నుంచి మొట్ట మొదటి క్యారక్టర్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పురాణ చారిత్రక చిత్రం నుంచి రిలీజైన కీర్తి సురేశ్ లుక్ వైరల్ అవుతోంది. అందులో కీర్తి సురేష్ మలయాళీ స్టైల్ డ్రెస్సింగ్‌తో ఆకట్టుకుంటోంది. శాస్త్రీయ సంగీతకళాకారణి ఆర్చా పాత్ర కోసం కీర్తి వీణ కూడా…