మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘మరక్కర్: లయన్ ఆఫ్ ది అరేబియన్ సీ’. ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేశ్, మంజు వారియర్, అర్జున్, కల్యాణీ ప్రియదర్శన్, ప్రణవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీలోని కీర్తి సూరేశ్ న్యూలుక్ బయటకు వచ్చింది. సంగీతకారిణిగా జీవితాన్ని మొదలుపెట్టి కేరళ యువరాణిగా పట్టాభిషిక్తురాలైన యువతిగా కీర్తి పాత్ర ఉండనున్నట్లు సమాచారం. ఒంటినిండా ఆభరణాలు ధరించి రాచరికపు కాలం నాటి వస్త్రధారణతో వీణ వాయిస్తున్నట్లు ఉన్న తన స్టిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తెరకెక్కించాడు. పోర్చుగీసువారిని ఎదురించి పోరాడిన నావికాధికారి కుంజాలీ మరక్కర్ జీవితం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. కాగా, కీర్తి సురేష్ టాలీవడ్ లో ప్రస్తుతం మహేష్ బాబు, దర్శకుడు పరుశురామ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘సర్కారు వారి పాట’ సినిమాలోను హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.