అవినీతి కేసులతో జగన్ తలొగ్గారు.. మోడీ, షాకు మోకరిల్లారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు మావోయిస్టు పార్టీ నేత గణేష్.. వైసీపీ రెండేళ్ల పాలనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. జగన్ ప్రజా వ్యతిరేక, నిరంకుశ విధానాలపై ఐక్య పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.. అవినీతి కేసులు ఉన్న జగన్ కేంద్రానికి తలొగ్గి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని… రెండేళ్ల జగన్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదంటూ తన లేఖలో పేర్కొన్నారు మావోయిస్టు పార్టీ ఆంధ్ర-ఒడిశా సరిహద్దు (ఏవోబీ) స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్.. అవినీతి కేసులతో తలొగ్గారు.. మోడీ, షాలకు మోకరిల్లారని ఆరోపించిన ఆయన.. జగన్ తను అరెస్టు కాకుండా చూసుకుంటున్నారని మండిపడ్డారు..
రెండేళ్ల పాలనలో మౌలిక వసతుల కల్పనలో విఫలం అయ్యారని విమర్శించింది మావోయిస్టు పార్టీ.. అన్నింటి నుంచి ప్రజలను పక్కదారి పట్టించడానికే మూడు రాజధానులు తెరపైకి తెచ్చారని ఆరోపించిన మావోయిస్టు నేత గణేష్.. విద్వేషాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుతున్నారని ఫైర్ అయ్యారు. ఇక, స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు జగన్ ఆమోదం తెలిపారని.. పైకి మాత్రం వ్యతిరేకిస్తున్నట్లు నటిస్తున్నారని పేర్కొన్నారు.. కేసులతో పత్రికా స్వేచ్ఛ హరించారని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. నిరంకుశ, అప్రజాస్వామిక పద్ధతులకు వ్యతిరేకంగా ఉద్యమిద్దాం.. ఈ ఉద్యమంలో ప్రజలందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు గణేష్..
Also Read
- Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
- JP Nadda: ఏపీ ఆరోగ్య రంగానికి రూ.64,100 కోట్లు.. జేపీ నడ్డా కీలక ప్రకటన
- CM Chandrababu: 2047 నాటికి భారత్, ఏపీ నంబర్ వన్.. ఆరోగ్య, టెక్నాలజీ రంగాల్లో దూసుకెళ్తాం..
- Deputy CM Pawan Kalyan: గురువాయూరప్ప సన్నిధిలో ఏపీ డిప్యూటీ సీఎం.. ప్రత్యేక పూజలు చేసిన పవన్..
తాజావార్తలు
-
Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
-
Irumudi Effect : అయ్యప్ప దీక్షలో గణపయ్య.. తలపై స్వయంగా ‘ఇరుముడి’ పెడుతున్న శివుడు!
-
Allu Arjun Fans : బాక్సాఫీస్ వద్దే కాదు సామాజిక సేవలోనూ ‘తగ్గేదే లే’
-
Dhee 10 Raju Arrested: లైంగిక వేధింపులు.. ఢీ రాజు అరెస్ట్!
-
Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!