మావోయిస్టు అగ్రనేత ఆర్కే మృతి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ (ఆర్కే) ఇక లేరని చెబుతున్నారు పోలీసులు.. బీజాపూర్ అడవుల్లో ఆయన చనిపోయినట్టుగా తెలుస్తోంది.. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆర్కే.. ఇవాళ కన్నుమూశారని తెలుస్తోంది.. ఇక, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో పోలీసులు-మవోయిస్టుల మధ్య జరిగిన చర్చల్లో కీలక పాత్ర పోషించారు రామకృష్ణ.. చాలా సమయాల్లో పెద్ద పెద్ద ఎన్‌కౌంటర్ల నుంచి చివరి నిమిషంలో ఆయన తప్పించుకున్నారు. భారీ ఎన్‌కౌంటర్ జరిగిన ప్రతీ సందర్భాల్లోనూ ఆర్కే చనిపోయారా? లేదా బతికే ఉన్నారా? అనే చర్చ కూడా సాగుతూ వచ్చింది. కానీ, మళ్లీ ఆయన కదలికలపై వార్తలు వచ్చేవి.. అయితే, గత రెండేళ్లుగా ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు… ఈ నేపథ్యంలోనే ఆయన మృతిచెంది ఉంటారని సమాచారం.
తీవ్ర అనారోగ్య సమస్యలతో బీజాపూర్ అడవుల్లో ఆర్కే మృతిచెందినట్టు బస్తర్ పోలీసులు చెబుతున్నారు.. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.. మావోయిస్టు అగ్రనేతల్లో ఒకరైనా ఆర్కేపై రూ.50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు రివార్డు ఉన్నట్టుగా తెలుస్తోంది.. ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై దాడి కేసులో కూడా నిందితుడిగా ఉన్నారు ఆర్కే.. ఎన్‌ఐఏ మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నారు ఆర్కే.. దేశవ్యాప్తంగా పలు కేసుల్లో కీలక సూత్రధారిగా ఉన్నారు ఆర్కే.. అయితే, దీనిపై తెలంగాణ పోలీసులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
Also Read
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?