కరోనా ఎఫెక్ట్..! మావోయిస్టు కీలక నేత హరిభూషణ్ మృతి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది… ఆ పార్టీ కీలక నేత, ఉత్తర తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి హరిభూషణ్ మరణించినట్టు తెలుస్తోంది.. అనారోగ్య కారణాలతో సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆయన కన్నుమూశారని తెలుస్తోంది… కరోనా మహమ్మారి సోకడానికి తోడు.. గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల వాడకంతో.. ఆయన పరిస్థితి విషమంగా మారి మరణించారని చెబుతున్నారు.. దాదాపు డజనుకు పైగా మావోయిస్టులు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ప్రచారం సాగుతోంది.. మరోవైపు.. అనారోగ్యం బారినపడి మావోయిస్టులతో పాటు ఇతరులు కూడా లొంగిపోవాలని.. పునరావాస ప్రయోజనాలు పొందాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తూనే ఉంది. ఇక, హరిభూషణ్ మరణవార్తపై స్పందించిన దంతేవాడ ఎస్పీ డాక్టర్ పల్లవ్… ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలోని మినగట్ట గ్రామంలో జూన్ 21న ఆహారం వికటించి లేదా కరోనా కారణంగా హరిభూషణ్ మరణించారిన తెలిపారు.. కాగా, హరిభూషణ్ పై రూ.40 లక్షల రివార్డు ఉంది.. ఛత్తీస్‌గఢ్ బస్తర్ డివిజన్ మరియు తెలంగాణ సరిహద్దులో ఆయన చాలా చురుకుగా పనిచేశారు.. తెలంగాణలోని మహాబుబాబాద్ జిల్లాలోని కొట్టగూడ ప్రాంతానికి చెందిన మారిగుడ గ్రామానికి చెందిన హరిభూషణ్ అలియా యాపా నారాయణ్… 1995లో పీపుల్స్ వార్ గెరిల్లాలో చేరారు. ప్రస్తుతం ఆయన మావోయిస్టు పార్టీ తెలంగాణ కార్యదర్శిగా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. గత కొన్ని ఎన్‌కౌంటర్లలో హరిభూషణ్ బయటపడ్డాడు. తెలంగాణ-ఛత్తీస్‌గడ్ సరిహద్దులో ఇటీవల జరిగిన అనేక హింస సంఘటనలలో హరిభూషణ్ కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు చెబుతున్నారు.
Also Read
- World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
- Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
- TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
తాజావార్తలు
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్‌ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!