‘మా’ ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి. అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న కంటెస్టెంట్లు కూడా తన వంతు ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఇక ఇటీవలే తన ప్యానెల్ సభ్యులను ప్రకటించిన హీరో మంచు విష్ణు ప్రెస్ తో తాజాగా తన ఆలోచనలను పంచుకున్నారు. కానీ విష్ణు చేసిన వ్యాఖ్యలు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ప్రస్తుత స్థితి గురించి తెలుపుతుంది. Read Also : హాలీవుడ్ పై కన్నేసిన సితార “మా ప్రెసిడెంట్ అనేది ట్యాగ్ కాదు, బాధ్యత. నేను…
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు అక్టోబర్ 10న హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో జరుగనున్నాయి. ఆరోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ నిర్వహించి సాయంత్రం ఫలితాలను వెల్లడించనున్నారు. కాగా, గతంలో ఎన్నడూ లేనివిధంగా ‘మా’ అధ్యక్ష పదవిని దక్కంచుకునేందుకు సినీనటులు పోటీపడుతున్నారు. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, హీరో మంచు విష్ణు, నటులు సీవీఎల్ నరసింహారావు, బండ్ల గణేష్ పోటీలో ఉన్నారు. అయితే ‘మా’ ఎలక్షన్ ప్రధానంగా ప్రకాశ్…
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ఎన్నికలు దగ్గర పడ్డాయి. మునుపెన్నడూ లేనంతగా ఈసారి ‘మా’ ఎన్నికల్లో రచ్చ చోటు చేసుకుంది. ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్న పోటీదారులు తమ సొంత ఎజెండాతో బిజీగా ఉన్నారు. సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్, యంగ్ హీరో విష్ణు మధ్య పోటీ గట్టిగా ఉంది. మరోవైపు నటుడు, నిర్మాత బండ్ల గణేష్ స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు. ఇక ఇప్పటికే ప్రకాష్ రాజ్ తన ప్యానల్ ను ప్రకటించగా, విష్ణు ప్యానెల్ లో…
అక్టోబర్ 10న “మా” ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే.. అయితే ‘మా’ వ్యవహారం టాలీవుడ్ లో కొత్త వివాదాలను తెర మీదకు తెస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు అధ్యక్ష బరిలో ఉన్న ప్రకాశ్ రాజ్ కు మద్దతుగా నిలిచిన బండ్ల గణేష్ ఇప్పుడు స్వతంత్రంగా ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేస్తున్నారు. తొలుత జీవిత, హేమ సైతం అధ్యక్ష బరిలో పోటీ చేయాలని భావించారు. అయితే, ప్రకాశ్ రాజ్ వ్యూహాత్మకంగా జీవిత, హేమతో చర్చలు జరిపి…
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కు బైక్ ప్రమాదం అని తెలియడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ కు గురైయ్యారు.. మరోవైపు టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు కూడా సాయి తేజ్ కోలుకోవాలని, ప్రార్థిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. మరికొందరు ఆయన్ను చూడ్డానికి ఆసుపత్రికి వస్తున్నారు. సాయి ధరమ్ తేజ్‌ను చూసేందుకు మంచు లక్ష్మీ ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. మంచు లక్ష్మీకి మెగా హీరోలకు మంచిస్నేహ బంధం ఉందన్న సంగతి తెలిసిందే. మరికాసేపటికి క్రితమే హీరో మంచు విష్ణు కూడా…
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ఊహించని పరిణామాలతో హాట్ హాట్ గా మారుతున్నాయి. ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి తప్పుకుంటున్నానని బండ్ల గణేశ్ స్పష్టం చేయడమే కాకుండా.. ప్రకాశ్ రాజ్ ప్యానల్‌లో జీవితా రాజశేఖర్ రాకను వ్యతిరేకిస్తూ వ్యాఖ్యలు చేశారు. మా ఎన్నికల్లో ఆమెకు పోటీగా జనరల్ సెక్రటరీగా పోటీ చేసి గెలుస్తానని సవాలు విసిరారు. ఇప్పటివరకూ ప్రకాశ్ రాజ్‌కు మద్దతిస్తూ ప్యానల్ సభ్యుడిగా ఉన్న బండ్ల గణేశ్ యూటర్న్ తీసుకోవడంతో మా ఎన్నికలు రసవత్తరంగా మారాయి.…
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో సినిమాల వలె ట్విస్టులు, అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటివరకు ప్రధాన పోటీదారులుగా వున్నా జీవిత రాజశేఖర్, హేమలు తప్పుకున్నారు. ఈ విషయాన్నీ ప్రకాష్ రాజ్ స్వయంగా ప్రకటించారు. ఆయన ప్రకటించిన ప్యానెల్ లోనే వాళ్ళు పేర్లు ఉంటడంతో ఒక్కసారిగా అందరు షాక్ అయ్యారు. ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. ‘ జీవిత రాజశేఖర్ తో రెండు గంటలకు పైగా మా కార్యచరణ గూర్చి మాట్లాడాను. ఆమెకు నచ్చడంతో నా ప్యానెల్‌లో…
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు గతంలోనూ ఎన్నడూ లేనివిధంగా సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపించబోతున్నాయి. కేవలం రెండేళ్లపాటు ఉండే మా అధ్యక్ష పదవిని దక్కించుకునేందుకు నటీనటులు తీవ్రంగా పోటీపడుతున్నారు. కేవలం 900మంది సభ్యులు ఉండే మా అసోసియేషన్ కు నిర్వహించడం ఈసారి కత్తిమీద సాములా మారింది. నటీనటుల మధ్య నెలకొన్న ఈగోల వల్ల ఈసారి ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపింపజేస్తున్నాయి. ఒకరిని మించి మరొకరు విమర్శలు చేసుకుంటుండటంతో మా పెద్దలు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం…
ఇవాళ కృష్ణాష్టమి! ఈ సందర్భంగా ప్రతి హిందువు ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. బాలకృష్ణుడి పాదాలను ఇంటి ప్రాంగణంలో ముద్రలుగా వేసుకునే వాళ్ళు కొందరైతే, తమ చిన్నారులను బాలకృష్ణుడిగా అలంకరిస్తున్న వారు మరికొందరు. సినిమా రంగం కూడా దానికి మినహాయింపేమీ కాదు. హీరో మంచు విష్ణు, ఆయన భార్య విరోనికా రెడ్డి తన కుమారుడు అవ్రామ్ కు బాలకృష్ణుడి వేషం వేశారు. నాలుగేళ్ళ అవ్రామ్ లో కృష్ణుడి కొంటె లక్షణాలు ఉన్నాయంటూ మురిసిపోతున్నారు తాతయ్య మోహన్ బాబు.…
మరికొన్ని రోజుల్లో జరగనున్న ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం ఐదుగురు సభ్యులు అధ్యక్ష పదవి కోసం పోటీపడనున్నారు. కాగా ఇప్పటికే, లోకల్-నాన్ లోకల్, మా నిధులు, మా శాశ్వత భవనం అంటూ ఒకరిపై ఒకరు పోటీదారులు ఆరోపణలు చేసుకోవడంతో వివాదం రోజుకో మలుపుతిరుగుతోంది. తాజాగా మంచు విష్ణు ట్విటర్ ద్వారా వీడియో సందేశం ఇస్తూ.. త్వరలోనే ‘మా’ శాశ్వత భవనం కల నెరవేరనుందని చెప్పుకొచ్చారు. భవనం నిర్మించడం కోసం మూడు స్థలాలు పరిశీలించామని విష్ణు తెలిపారు.…