మే 12న బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ చూడటానికి వచ్చిన ప్రేక్షకులు.. పాడైపోయిన ఆహారం తిన్నామంటూ ఆరోపించారు. దీంతో.. బాధితుల ఫిర్యాదు మేరకు కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ మేనేజ్‌మెంట్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది. కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో కేఎస్‌సీఏ మేనేజ్‌మెంట్, క్యాంటీన్ మేనేజర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
రాజస్థాన్‌లో విషాదం చోటు చేసుకుంది. ఒక వ్యక్తి మొదట తన తండ్రిని గొంతుకోసి చంపాడు. అనంతరం తన 5 ఏళ్ల కొడుకుతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌లోని పాలి ప్రాంతంలో విషాద సంఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి మొదట తన తండ్రిని గొంతు కోసి హత్య చేసి, ఐదేళ్ల కొడుకుతో కలిసి చెరువులో దూకి సూసైడ్ చేసుకున్నాడు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా.. యూపీలోని ఫతేహాబాద్‌లో రాష్ట్రీయ శోషిత్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు స్వామి ప్రసాద్ మౌర్య పర్యటిస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థి హోతమ్ సింగ్ మద్దతుగా సభలో ప్రసంగిస్తుంగా స్వామి ప్రసాద్ మౌర్యపై ఓ యువకుడు షూ విసిరాడు. అయితే స్వామి ప్రసాద్ మౌర్య తృటిలో తప్పించుకున్నారు. అనంతరం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు.. సభా స్థలికి వెళుతున్న స్వామి ప్రసాద్ మౌర్యకు వ్యతిరేకంగా నల్లజెండాలతో నిరసన చేపట్టారు.
లండన్ (లండన్ స్టబ్)లో చాలా ఆశ్చర్యకరమైన కేసు వెలుగులోకి వచ్చింది. నార్త్-ఈస్ట్ లండన్‌లో ఓ వ్యక్తి కత్తితో ప్రజలు, పోలీసులపై దాడి చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దాడికి పాల్పడే ముందు దుండగుడు తన కారును ఓ ఇంట్లోకి తీసుకెళ్లి.. అక్కడున్న వారిపై దాడి చేశాడని పేర్కొన్నారు. కాగా.. 36 ఏళ్ల నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకుముందు కూడా ఆ వ్యక్తి చాలా మంది వ్యక్తులు, పోలీసులపై దాడికి పాల్పడ్డాడు.
ఢిల్లీలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఓ కారు ముగ్గురి ప్రాణాలను బలి తీసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఓ వివాహ కార్యక్రమానికి హాజరై.. అర్ధరాత్రి బైక్‌పై సోదరీమణులతో కలిసి సురేందర్ ఇంటికి తిరిగి వెళ్తుండగా వేగంగా వచ్చిన కారు.. బైక్‌ను ఢీకొట్టి వారి మీద నుంచి వెళ్లిపోయింది.
వాళ్లిద్దరూ మంచి స్నేహితులు.. ఇండోర్ కు చెందిన 28 ఏళ్ల వ్యక్తికి 2021లో ఉత్తరప్రదేశ్ కు చెందిన వైభవ్ శుక్లా అనే యువకుడితో సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త విపరీతమైన ప్రేమగా మారింది. అయితే వైభవ్.. ఆ యువకుడిని సెక్స్ చేంజ్ ఆపరేషన్ చేయించుకుంటే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అలా అయితే సమాజంలో గౌరవంగా జీవించవచ్చని ఆ యువకుడికి చెప్పాడు. దీంతో బాధితుడు లింగమార్పిడి ఆపరేషన్‌తో స్త్రీగా మారాడు. ఇప్పటి వరకు బాగానే…
Man Bites Traffic Police Finger in Bengaluru: భారత దేశంలో హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ ట్రాఫిక్ పోలీసులకు చిక్కితే.. చాలా మంది పారిపోవడానికి ప్రయత్నిస్తారు. తప్పించుకోవడానికి వెల్లేకపోతే.. ఏదో ఓ కారణం చెప్పి అక్కడినుంచి బయటపడుతుంటారు. కానీ వ్యక్తి ఏకంగా ట్రాఫిక్ కానిస్టేబుల్ వేలు కొరికాడు. ఈ ఘటన బెంగుళూరులోని విల్సన్ గార్డెన్ 10వ క్రాస్ వద్ద చోటుచేసుకుంది. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వివరాల ప్రకారం… సయ్యద్ సఫీ…
స్నేహితులన్నాక ఒకరికొకరు సాయం చేసుకోవడం.. ఒకరి బాధలు మరొకరు పంచుకోవడం అనేది ఫ్రెండ్‌షిప్‌లో కామన్. సినిమాల్లో చూసినట్లుగా ప్రేమికులకు స్నేహితులు సహాయం చేయడం చాలా చూసుంటాం.