ఉత్తరప్రదేశ్‌లో ఓ బీజేపీ నేత కుమారుడు రెచ్చిపోయాడు. 70 ఏళ్ల వృద్ధుడిపై దాడికి తెగబడ్డాడు. అడ్డొచ్చిన అతడి భార్యపై దాడి చేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.
ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్‌లో వికాస్ దూబే (24) అనే వ్యక్తి మరోసారి పాము కాటుకు గురయ్యాడు. ఏదో ఒకసారో.. రెండుసార్లు కాదు.. 40 రోజుల్లో ఏడు సార్లు పాము కాటుకు గురయ్యాడు. దీంతో.. వికాస్ దూబే తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరాడు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దూబే గురువారం సాయంత్రం తన మామ ఇంట్లో పాము కాటుకు గురయ్యాడు. కాగా.. జూన్ 2 నుంచి జూలై 6 మధ్య అతన్ని ఆరుసార్లు పాము…
ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడి పై నుంచి వాటర్ ట్యాంకర్ వెళ్లడంతో తీవ్ర గాయాలైన అతన్ని ఆస్పత్రికి తరలించే లోపే ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనకు సంబంధించిన మొత్తం వీడియో సీసీటీవీ కెమెరాలో రికార్డైంది.
ఏపీలో ఓ అత్యాచార ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అన్నమయ్య జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మహిళపై ఓ వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన వీరబల్లి మండలం ఓదివీడు గ్రామం దూళ్ళ హరిజనవాడలో జరిగింది.
దేశ రాజధానిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పిల్లలు లేని తల్లిదండ్రులు ఎంతో బాధపడుతుంటే.. ఈ కసాయి తండ్రి మాత్రం కవల ఆడపిల్లలు పుట్టారని చంపేశాడు. ఇద్దరు ఆడపిల్లలు పుట్టడం ఇష్టం లేదని.. ఈ క్రమంలో తండ్రి, అతని కుటుంబం ఆ పిల్లలను చంపి.. పూడ్చిపెట్టారు. కాగా.. ఈ ఘటనపై నిందితుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో.. ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగి, న్యాయ ఆదేశాల మేరకు శిశువుల మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం…
యూపీలోని ఆగ్రాలో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. పోలీసుల వేధింపులతో విసిగిపోయిన ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బర్హాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రూపధాను గ్రామంలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న ఏసీపీ డా.సుకన్య శర్మ, బర్హాన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. మృతదేహాన్ని అదుపులోకి తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
ఇటలీలో ఓ భారతీయ వ్యవసాయ కూలీ మృతి విషాదంగా మారింది. అక్కడ భారతీయ కార్మికుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సత్నామ్ సింగ్ (31) అనే వ్యక్తి బుధవారం రోమ్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. గ్రామీణ ప్రాంతమైన ఆగ్రో పాంటినోలోని పొలంలో పనిచేస్తుండగా గాయపడ్డాడు. రెండ్రోజుల పాటు ఆస్పత్రితో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృడుతు పంజాబ్ రాష్ట్రానికి చెందిన మోగా నివాసి.
16 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడు 23 ఏళ్ల యువకుడికి కర్ణాటక హైకోర్టు 15 రోజుల బెయిల్ మంజూరు చేసింది. అసలు విషయానికొస్తే.. బాధిత మహిళ ఓ పాపకు జన్మనిచ్చింది. బాధితురాలికి ఇటీవలే 18 ఏళ్లు కూడా నిండాయి. ఈ క్రమంలో.. ఇరువర్గాల కుటుంబాలు వారికి పెళ్లి చేసేందుకు సానుకూలంగా ఉన్నాయి. మరోవైపు.. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి బిడ్డకు జీవనాధారమైన తండ్రి అని…
ముంబైలోని వసాయ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన ప్రియురాలిని నడిరోడ్డుపై ఇనుప రెంచ్‌తో తలపై 14 సార్లు కొట్టి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన మంగళవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో చించ్‌పాడ ప్రాంతంలో జరిగింది. అయితే.. మహిళపై దాడి చేస్తుండగా చాలా మంది ఘటన స్థలంలో ఉన్నప్పటికీ, ఎవరూ ఆపడానికి సాహసించలేదు.. అలానే చూస్తూ ఉండిపోయారు.