చావు ఎప్పుడు.. ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. ఈ మధ్య చిన్నా..పెద్ద తేడా లేకుండా కళ్ల ముందే కుప్పకూలిపోతున్నారు. ఇలాంటి ఘటనలు ఈ మధ్య తరుచుగా జరుగుతున్నాయి.
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. దక్షిణ కోల్‌కతాలోని టోలీగంజ్ ప్రాంతంలో ఒక చెత్త కుప్పలో కట్ చేసి ఉన్న మహిళ తల లభ్యమైంది. కాగా.. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడు తన బావని 24 గంటల్లోనే పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు అతిఉర్ రెహమాన్ లస్కర్‌గా గుర్తించారు.
కర్నూలు జిల్లాలో తల్లీకూతుళ్ల అనుమానాస్పద మృతి కేసులో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హోలగుంద మండలం హెబ్బటంలో తల్లి, బిడ్డను హత్య చేసింది భర్తే అని నిర్ధారణకు వచ్చారు స్థానిక పోలీసులు.. భార్య సలీమా(24) , కూతురు సమీరా(4) ను భర్త సక్రప్ప గొంతు నులిమి చంపినట్లుగా విచారణలో తేల్చారు పోలీసులు.. అయితే, బిడ్డను చంపి తల్లి ఆత్మహత్య చేసుకుందని భర్త సక్రప్ప మొదట ప్రచారం చేసిన విషయం విదితమే..
గ్రేటర్ నోయిడాలో ఒక యువకుడు రెచ్చిపోయాడు. ఒక మహిళను పట్టుకుని ఇష్టానురీతిగా దిడి చేశాడు. జుట్టుపట్టుకుని చెంపలు వాయించాడు. ఆమె దుర్భాషలాడాడు. దీంతో ఆమె దెబ్బలు తాళలేక ఇబ్బందులు పడింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
నంద్యాల జిల్లాలో సెల్ఫీ పిచ్చి ఓ యువకుడి ప్రాణం తీసింది.. మహానంది క్షేత్రం సమీపంలోని తెలుగు గంగ కాల్వ వద్ద సెల్ఫీ దిగడానికి వెళ్లిన సుర గౌతమ్ అనే యువకుడు ప్రమాదవశాత్తు తెలుగుగంగలో పడి గల్లంతయ్యాడు.. గాజులపల్లె ఆర్.ఎస్. సమీపంలో గౌతమ్ మృతదేహన్ని గుర్తించారు స్థానికులు.
Mumbai: ముంబైలో దారుణం చోటు చేసుకుంది. మాల్వాని ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ మహిళ ముఖంపై భర్త యాసిడ్ పోసి దాడి చేశాడు. ఈ ఘటనలో బాధితురాలిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పాముకాటుతో 22 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. అనంతరం.. అతని చితిపైనే కాటేసిన పామును సజీవ దహనం చేశారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో చోటు చేసుకుంది. ఆదివారం రోజు ఈ ఘటన జరిగింది. అయితే స్థానికులు.. పాము మరొకరికి హాని చేస్తుందనే భయంతో దానిని చితిపై కాల్చారు.
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య భద్రతలో భారీ లోపం వెలుగు చూసింది. బెంగళూరులో ఇంటర్నేషనల్ డెమొక్రసీ డే వేడుకలకు హాజరైన సీఎం.. స్టేజ్ పై కూర్చుని ఉండగా అనుకోని సంఘటన జరిగింది. గుర్తు తెలియని ఓ యువకుడు సెక్యూరిటీని దాటుకుని మరీ వేదికపైకి దూసుకొచ్చాడు. అతని చేతిలో ఉన్న శాలువాని సిద్ధరామయ్యపైకి విసిరాడు. వెంటనే అలర్ట్ అయిన సీఎం భద్రతా సిబ్బంది అతడిని పట్టుకున్నారు.
ఒక ఈవ్టీజర్కు నడిరోడ్డుపైనే ఇద్దరు యువతులు బుద్ధి చెప్పారు. కారులో వెళ్తుండగా బుల్లెట్ రైడర్ వేడిపించాడు. అంతే అతగాడికి బుద్ధి చెప్పాలని డిసైడ్ అయ్యారు. కారు ఆపి.. యువకుడ్ని అడ్డుకున్నారు. దిగి దిగగానే ఈవ్టీజర్ చెంపలు వాయించారు. అక్కడే ఉన్న ఓ వాహనదారుడు మొబైల్లో ఈ సీన్ను చిత్రీకరించాడు.