ప్రస్తుతం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. పార్లమెంట్ సమావేశాల సమయంలో జాతీయ స్థాయిలో ప్రజల దృష్టిని ఆకర్షించిన అనేక ఆసక్తికరమైన ఉదంతాలు చోటు చేసుకున్నాయి.
Mamata Banerjee: ఇటీవల బంగ్లాదేశ్ అల్లర్లను ఉద్దేశిస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బంగ్లాదేశ్ తన నిరసనను దౌత్యమార్గాల ద్వారా తెలియజేసినట్లు విదేశీవ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం చెప్పింది.
Bangladesh Protest : బంగ్లాదేశ్లో దిగజారుతున్న పరిస్థితులపై మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యపై భారతదేశంలో వివాదం ఆగలేదు..బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా దీనిపై స్పందించింది.
Mamata Banerjee: కేంద్ర బడ్జెట్ 2024-25పై బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు. ఈ బడ్జెట్ రాజకీయ ప్రేరేపితమని, ఎలాంటి దశ లేదని, ప్రజలకు వ్యతిరేకమైందని, దార్శనికత లేనిదిగా ఆమె అభివర్ణించారు.
బంగ్లాదేశ్ ప్రజలకు బెంగాల్ రాష్ట్రానికి వచ్చేందుకు ద్వారాలు తెరిచే ఉంటాయి: సీఎం మమతా, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యలను ఖండించిన గవర్నర్ సీవీ ఆనంద బోస్.., దీదీ వ్యాఖ్యలపై నివేదిక సమర్పించాలని ఆదేశాలు: గవర్నర్ సీవీ ఆనంద బోస్..
BJP: మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్ అవుతోంది. బంగ్లాదేశ్ హింసాత్మక ఘటనల గురించి మాట్లాడుతూ, బంగ్లాదేశ్ నుంచి శరణు కోరి వచ్చే ప్రజలకు బెంగాల్ అండగా నిలుస్తుందని, వారికి ఆశ్రయం ఇస్తుందని చెప్పారు. మమతా చేసిన వ్యాఖ్యల్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది.
బంగ్లాదేశ్ హింసాకాండ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ భారీ ప్రకటన చేశారు. ఆదివారం కోల్కతాలో అమరవీరుల దినోత్సవ ర్యాలీ సందర్భంగా విక్టోరియా హౌస్ ముందు ఏర్పాటు చేసిన సమావేశంలో మమతా బెనర్జీ బంగ్లాదేశ్ ప్రజలకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
Akhilesh Yadav: బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో ఈ రోజు ‘ ధర్మతల ర్యాలీ’ని నిర్వహించారు. కోల్కతాలో జరిగిన ఈ ర్యాలీలో సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Mamata Banerjee: భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగడం కష్టమేనని పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యనించారు.
ప్రపంచ కుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహం జూలై 12, అనగా శుక్రవారం అంగరంగ వైభవంగా జరగనుంది. ఇందుకోసం ముంబైలోని పెళ్లి వేదికను సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు.