నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు (Droupadi murmu) కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే (Mallikarjun Kharge) లేఖ రాశారు.
అనంతపురం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో 'న్యాయ సాధన' సభ పేరుతో బహిరంగ సభను నిర్వహించింది. ఈ సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ.. అనంతపురం జిల్లా అంటే సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి అమిత ప్రేమ అని అన్నారు. మరోవైపు.. రాష్ట్ర అభివృద్ధి వైఎస్సార్ హాయంలోనే జరిగినట్లు చెప్పారు. అలాంటి.. సుపరిపాలన అందించేందుకు వైఎస్ షర్మిలను మీ ముందుకు తీసుకొచ్చామని ఖర్గే పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడుతుందని, తప్పకుండా…
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు (Mallikarjun Kharge) కేంద్రం భద్రత పెంచింది. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం కేంద్ర హోంశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
సార్వత్రిక ఎన్నికల ముందు తమిళనాడు కాంగ్రెస్‌లో మార్పులు.. చేర్పులు చోటుచేసుకున్నాయి. తమిళనాడు పీసీసీ అధ్యక్షుడిగా కెఎస్. అళగిరి స్థానంలో సెల్వపెరుంతగై నియమితులయ్యారు
బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే (Mallikarjun Kharge) సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ (PM Modi) మూడోసారి గెలిస్తే ఇకపై ఎన్నికలు ఉండవని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ (Sonia Gandhi) రాజ్యసభకు (Rajya Sabha) పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఆమె నిర్ణయం తీసుకున్నారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేపై రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డీ) అధినేత జయంత్ చౌధరి రాజ్యసభలో మాట్లాడుతుండగా మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) అభ్యంతరం వ్యక్తం చేశారు.
Mallikarjun Kharge: రాజ్యసభలో ఈ రోజు ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. యూపీఏ ప్రభుత్వంలో వైఫల్యాలను పీఎం మోడీ ఎండగట్టారు. అయితే, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అంతే స్థాయిలో బీజేపీపై విమర్శలు చేశారు. ప్రధాని నిరుద్యోగం, ధరల పెరుగుదల, ఆర్థిక అసమానత వంటి అంశాలపై మాట్లాడలేదని, రాజ్యాంగంపై నమ్మకం లేని వారు కాంగ్రెస్‌కి దేశభక్తి గురించి బోధిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.
Mallikarjun Kharge: సీఎం నితీష్ కుమార్ ఇండియా కూటమిని వదిలి, బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జన ఖర్గే ఆరోపించారు. జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ ఇండియా కూటమిని చీకట్లో ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ, జేడీయూ కలిసి ఇండియా కూటమిని విచ్ఛిన్నం చేయడానికి ప్లాన్ చేశారని ఆదివారం దుయ్యబట్టారు.