Loksabha Elections : అమేథీ-రాయ్బరేలీ లోక్సభ స్థానానికి కాంగ్రెస్ తన అభ్యర్థి ఎవరనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అమేథీ నుంచి పోటీ చేసేందుకు రాహుల్ గాంధీ ఇంకా అంగీకరించలేదు.
తమ మేనిఫెస్టో గురించి వివరించేందుకు ప్రధాని మోడీతో సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇటీవల సమయం అడిగారు. దీనిని ఉద్దేశించి అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ చేసిన వ్యాఖ్యలకు ఖర్గే ఘాటుగా సమాధానం ఇచ్చారు.
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే తొలి విడత పోలింగ్ ఏప్రిల్ 19న ముగిసింది. ఇక సెకండ్ విడత ఓటింగ్ శుక్రవారమే జరగనుంది. ఇందుకోసం ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది.
దేశంలో ఎండలు మండుతున్నట్లుగానే.. రాజకీయ నాయకుల మాటలు కూడా మండితున్నాయి. ప్రచారంలో నేతలు మాటల-తూటాలు పేల్చుకుంటున్నారు. పోలింగ్ సమయాలు దగ్గర పడే కొద్దీ ప్రసంగాలు కూడా హీటెక్కుతున్నాయి.
Mallikarjun Kharge: కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తన సొంత గడ్డ కర్ణాటకలోని కలబురిగితో భావోద్వేగ ప్రసంగం చేశారు. ‘‘ప్రజలు తమ పార్టీకి ఓటేయడానికి ఇష్టపడకపోయినా, ప్రజల కోసం పనిచేశానని భావిస్తే కనీసం తన అంత్యక్రియలకైనా హాజరు కావాలి’’ అని ప్రజలను బుధవారం కోరారు.
Mallikarjun Kharge: రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్ మేనిఫెస్టోను ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ చెబుతున్న సంపద పునర్విభజన చొరబాటుదారులకు, ఎక్కువ మంది పిల్లలకు ఉన్నవారికి ఇస్తుందా..? అని ప్రశ్నించారు.
Mallikarjun Kharge : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తమ పార్టీ మేనిఫెస్టోకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ కోరారు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సోమవారం వెల్లడించారు.
సార్వత్రిక ఎన్నికల వేళ మరో వివాదం తెరపైకి వచ్చింది. దేశ వ్యాప్తంగా ఉన్న సైనిక స్కూళ్లను ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ కేంద్రంపై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది.