Mallikarjun Kharge: ‘‘రాహుల్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించారు’’.. పప్పులో కాలేసిన ఖర్గే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mallikarjun Kharge: 2024 లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి మరో ఇబ్బందికర పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేసిన ప్రసంగంలో ఘోరమైన తప్పు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అరవింద్ కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు ఇండియా కూటమి రామ్ లీలా మైదానంలో మహార్యాలీకి పిలుపునిచ్చారు. అయితే ఈ కార్యక్రమంలో ఖర్గే మాట్లాడుతూ..‘‘రాహుల్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించారు’’ అని వ్యాఖ్యానించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
Read Also: Lok Sabha Elections: యూపీలో అప్నాదళ్(కే)తో అసదుద్దీన్ ఓవైసీ పొత్తు..
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
- LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
- Rahul Gandhi's SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
ఈ దేశ స్వాతంత్ర్యం కోసం మేము రక్తమోడాము. దేశాన్ని ఒకటిగా ఉంచేందుకు ఇందిరాగాంధీ ప్రాణాలు త్యాగం చేశారు. రాహుల్ గాంధీ దేశం కోసం అమరుడయ్యాడు. అతని శరీరం ముక్కలైంది. ఇందిరాగాంధీ బుల్లెట్లకు బలయ్యారు’’అని ఖర్గే తన ప్రసంగంలో పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
ఈ రోజు ఢిల్లీలోని రాంలీలా మైదానంలో జరిగిన ‘లోక్‌తంత్ర బచావో’ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమానికి శరద్ పవార్, రాహుల్ గాంధీ, ఉద్ధవ్ ఠాక్రే, ఆర్జేడీకి చెందిన తేజస్వీ యాదవ్, మెహబూబా ముఫ్తీ, ప్రియాంకాగాంధీ, అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ పాల్గొన్నారు. ప్రతిపక్షాలను దెబ్బ కొట్టేందుకు కేంద్రంలో బీజేపీ నాయకులను అరెస్ట్ చేస్తోందని ఇండియా కూటమి నేతలు ఆరోపించారు.
“राहुल गांधी ने देश के लिए जान दी, उनके शरीर के टुकड़े-टुकड़े हो गये”
Never a dull moment with @kharge ji in the house!!😂😂 pic.twitter.com/fW9f2JxC6p
— Priti Gandhi (@MrsGandhi) March 31, 2024
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?