నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ‘లవ్‌స్టోరీ’ సినిమా సెప్టెంబర్ 24వ తేదీన విడుదలై ఘనవిజయం సొంతం చేసుకుంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత టాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ మూవీని వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ పతాకంపై నారాయణదాస్ నారంగ్, రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మించారు. ముఖ్యంగా ఈ మూవీకి పవన్ సీహెచ్ అందించిన సంగీతం ప్లస్ పాయింట్‌గా నిలిచింది. సారంగదరియా పాట అయితే యూట్యూబ్‌లో రికార్డులను కొల్లగొట్టింది.…
ప్రముఖ మలయాళ నటుడు రిజబావా (55) సోమవారం అనారోగ్యంతో కన్నుమూశారు. కొచ్చిలోని ప్రైవేట్ హాస్పటిల్ లో కిడ్నీకి సంబంధించిన చికిత్స తీసుకుంటూ ఆయన చనిపోయారని కుటుంబ సభ్యులు తెలిపారు. 1990లలో మలయాళ చిత్రసీమలో గుణచిత్ర నటుడిగా, ప్రతినాయకుడిగా పలు పాత్రలు పోషించి మెప్పించారు రిజబావా. నాటక రంగం నుండి చిత్రసీమలోకి ఆయన 1984లో ‘విష్ణుపక్షి’ చిత్రంతో అడుగుపెట్టారు. అయితే ఆ మూవీ విడుదల కాలేదు. ఆ తర్వాత ఆరేళ్లకు ఆయన నటించిన ‘డాక్టర్ పశుపతి’ చిత్రంతో అందరి…
(సెప్టెంబర్ 7న మమ్ముట్టికి 70 ఏళ్ళు పూర్తి) మళయాళ చిత్రసీమలో ప్రేమ్ నజీర్ తరువాత సూపర్ స్టార్ స్థానం ఖాళీ అయింది. ఆ సమయంలో ప్రేమనజీర్ తరం వారు భలేగా పోటీపడ్డారు. కానీ, వారి తరువాత వచ్చిన మమ్ముట్టి ఆ స్థానం ఆక్రమించారు. తనదైన అభినయంతో మమ్ముట్టి అనేక మళయాళ చిత్రాలను విజయతీరాలకు చేర్చారు. తక్కువ పెట్టుబడితోనే చూపరులను కట్టిపడేసేలా చిత్రీకరించడంలో మళయాళ దర్శకులు ఆరితేరినవారు అని ప్రతీతి. మమ్ముట్టి చిత్రాలను మన బడ్జెట్ తో పోల్చి…
మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, పాపులర్ నటి పార్వతి ప్రధాన పాత్రధారులుగా మంగళవారం ‘పుళు’ పేరుతో ఓ సినిమా మొదలైంది. ఈ మూవీ ద్వారా రథీనా దర్శకురాలిగా పరిచయం అవుతోంది. మమ్ముట్టి తనయుడు, ప్రముఖ నటుడు దుల్కర్ సల్మాన్ సొంత బ్యానర్ లో ఈ మూవీని నిర్మిస్తుండటం విశేషం. నాలుగేళ్ళ క్రితం మమ్ముట్టి నటించిన ‘కసాబా’ మూవీలో ఆయన పోషించిన పాత్ర సెక్సిజమ్ ను ప్రోత్సహించేలా ఉందంటూ అప్పట్లో పార్వతి ఆరోపణలు చేసింది. దాంతో మమ్ముట్టి అభిమానులు…
తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. గ్లామర్ విషయంలోనూ ఈషా ఏమాత్రం తగ్గకుండా నటిస్తోంది. సోషల్ మీడియాలోనూ హాట్ నెస్ తో అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇక ఆమె నటించిన ‘రాగల 24 గంటల్లో’ సినిమా ఈషాకు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. ‘అరవింద సమేత’లో మెరిసిన ఈ బ్యూటీ, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ సినిమాలోను నటిస్తోంది. తాజాగా ఈషా మలయాళంలో సినిమాలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.…
మలయాళ మెగాస్టార్ మోహన్‌లాల్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న మలయాళ బిగ్‌బాస్ సీజన్ 3 షూటింగ్‌ను తమిళనాడు పోలీసు అధికారులు నిలిపివేశారు. చెన్నైలోని ఈవీపీ ఫిల్మ్‌సిటీలో ఈ షో కోసం వేసిన షూటింగ్ సెట్‌ను సీజ్ చేశారు. కరోనా ఆంక్షలు ఉల్లంఘించి చిత్రీకరణ జరిపించారు. కాగా, బిగ్ బాస్ హౌస్ లో పనిచేసే వారిలో మొత్తం 6 మందికి కరోనా సోకింది. అయినా కూడా నిర్వాహకులు షోని నిలిపివేయకుండా రహస్యంగా కంటిన్యూ చేశారు. ఈ సమాచారం బయటకు రావడంతో…