నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ‘లవ్‌స్టోరీ’ సినిమా సెప్టెంబర్ 24వ తేదీన విడుదలై ఘనవిజయం సొంతం చేసుకుంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత టాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ మూవీని వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ పతాకంపై నారాయణదాస్ నారంగ్, రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మించారు. ముఖ్యంగా ఈ మూవీకి పవన్ సీహెచ్ అందించిన సంగీతం ప్లస్ పాయింట్‌గా నిలిచింది. సారంగదరియా పాట అయితే యూట్యూబ్‌లో రికార్డులను కొల్లగొట్టింది.
హీరో చైతూ ఈ సినిమాలో తన కెరీర్‌లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తాను మంచి డ్యాన్సర్ అని ఈ మూవీతో సాయిపల్లవి మరోసారి నిరూపించింది. దీంతో విడుదలైన రోజు నుంచే మంచి టాక్‌తో ‘లవ్‌స్టోరీ’ మంచి కలెక్షన్లు సాధించింది. ఇప్పుడు ‘లవ్‌స్టోరీ’ మూవీని మలయాళంలో డబ్ చేస్తున్నారు. ‘ప్రేమతీరం’ అనే టైటిల్‌తో ఈనెల 29న అక్కడ విడుదల చేయనున్నట్లు సమాచారం. హీరోయిన్ సాయిపల్లవికి మలయాళంలో మంచి క్రేజ్ ఉంది. దీంతో ఈ మూవీ నిర్మాతలు మల్లూవుడ్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేపట్టారు. కాగా ఈ మూవీ తెలుగు వెర్షన్ ఈనెల 22 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.