Delhi : దేశ రాజధానిలో దోమల వల్ల వచ్చే వ్యాధుల కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. దోమల వల్ల వచ్చే డెంగ్యూ వ్యాధితో ఆదివారం తొలి మరణం సంభవించింది. డెంగ్యూతో బాధపడుతున్న 54 ఏళ్ల వ్యక్తి గత వారం లోక్ నాయక్ ఆసుపత్రిలో మరణించినట్లు అధికారులు తెలిపారు.
TG Health Department: హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ సంచాలకుల కార్యాలయం పలు సూచనలు చేసింది.
Telangana: తెలంగాణ రాష్ట్రంలో డెంగ్యూ, మలేరియా జ్వరాలు విజృంభిస్తున్నాయి. రోజురోజుకు జర్వాలు పెరుగుతుండటంతో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో జిల్లా, మండల, గ్రామ వ్యాప్తంగా భయాందోళన పరిస్థితులు ఏర్పడ్డాయి.
Mumbai: ముంబైలో ఒక బాలుడికి చాలా అరుదైన ఆరోగ్య పరిస్థితి ఏర్పడింది. ఒకే సారి డెంగ్యూ, మలేరియా, లెప్టోస్పిరోసిస్ వ్యాధులు ఎటాక్ అయ్యాయి. కుర్లాకు చెందిన 14 ఏళ్ల బాలుడికి ఈ మూడు వ్యాధులు ఒకేసారి సోకాయి
Dengue Fever Alert: వానాకాలం సీజన్ మొదలైంది. డెంగ్యూ, చికున్‌గున్యా, మలేరియా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వర్షాల కారణంగా వాతావరణంలో దోమల వ్యాప్తి పెరుగుతుంది. దీని కారణంగా దోమల ద్వారా వచ్చే వ్యాధులు కూడా పెరుగుతాయి. మొదట దోమలను నివారించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలి.
Malaria: దోమల ద్వారా సంక్రమించే మలేరియా వ్యాధి అమెరికాను గడగడలాడిస్తోంది. దాదాపుగా 20 ఏళ్ల తర్వాత తొలిసారిగా యూఎస్ఏలో మలేరియా కేసులు నమోదు అవుతున్నాయి. రెండు నెలల్లో 5 కేసులు నమోదయ్యాయి. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(CDS) ప్రకారం, నాలుగు కేసులు ఫ్లోరిడాలో కనుగొనబడ్డాయి. ఐదో కేసు టెక్సాస్ లో కొనుగొనబడింది. రోగులు విదేశాలకు వెళ్లిన దాఖలాలు లేకపోవడంతో ఈ వ్యాధి స్థానికంగానే సంక్రమించిందని వైద్యాధికారులు తెలిపారు.
కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా మలేరియా నివారణ చర్యలకు ఆటంకం కలిగిందని.. దీంతో మలేరియా కేసులు, మరణాలు పెరిగాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. ‘వరల్డ్ మలేరియా రిపోర్ట్-2022’ను ప్రపంచ ఆరోగ్య సంస్థ శనివారం విడుదల చేసింది.
పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం బోడిగూడెంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్రామస్తులకు వైద్య సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది. మలేరియా డెంగ్యూ పరీక్షలు కిట్స్ లేవన్న వైద్య సిబ్బంది తీరుపై ఆగ్రహించారు గ్రామస్తులు. ఇప్పటికే అంతుచిక్కని వ్యాధి తో నలుగురు విద్యార్థులు మృతిచెందడం ఆందోళన కలిగిస్తోంది. అనారోగ్యానికి గురైన మరో 50 మంది విద్యార్థులు చికిత్స పొందుతున్నారు.వరుస మరణాల నేపథ్యంలో పాఠశాలను బలవంతంగా మూయించారు తల్లిదండ్రులు.