అడవి శేష్… చిత్రపరిశ్రమలో దాదాపు రెండు దశాబ్దాల ప్రయాణం. చిత్రపరిశ్రమలో తనకంటూ ఎలాంటి అండదండలు లేకున్నా ఒక్కో స్టెప్ ఎదుగుతూ… ప్రస్తుతం కెరీర్ పరంగా పీక్స్ లో ఉన్న నటుడు. ‘క్షణం’, ‘గూఢచారి’, ‘ఎవరు’ వంటి హిట్స్ తర్వాత చక్కటి ఫాలోయింగ్ తెచ్చుకున్న శేష్ ప్రస్తుతం ‘మేజర్’ పేరుతో ప్యాన్ ఇండియా ఫిల్మ్ చేస్తున్నాడు. రచయిత కావటం శేష్ కి ఉన్న అదనపు బలం. ‘మేజర్’తో బాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అడవిశేష్. ఈ సినిమాకు కథను…
2008 నవంబర్ 26న ముంబై తాజ్ మహల్ ప్యాలెస్ పై ఉగ్రమూకలు జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్. అతని జీవితం ఆధారంగా తెరకెక్కుతోంది ‘మేజర్’ చిత్రం. అడవి శేష్ టైటిల్ రోల్ పోషిస్తున్నఈ సినిమా టీజర్ ఉగాది కానుకగా సోమవారం సాయంత్రం విడుదలైంది. మేజర్ ఉన్ని కృష్ణన్ ఈ దేశం కోసం ఎలా ప్రాణాలు ధారపోశాడు అనేది కాకుండా… ఎలా ఈ దేశం కోసం జీవించాడు అనే దానిని ఈ…
యంగ్ టాలెంటెడ్ హీరో అడవిశేష్ హీరోగా, శోభిత ధూళిపాళ్ల, సయీ మంజ్రేకర్ హీరోయిన్లుగా నటిస్తున్న ప్రతిష్టాత్మకమైన మూవీ ‘మేజర్’. ఈ చిత్రంలో శోభిత ప్రమోద అనే పాత్రలో నటిస్తున్నారు. అడవిశేష్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. 26/11 ముంబై తీవ్రవాద దాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు ‘మేజర్’ టీజర్…