‘మేజర్’ టీజర్… గూజ్ బంబ్స్!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2008 నవంబర్ 26న ముంబై తాజ్ మహల్ ప్యాలెస్ పై ఉగ్రమూకలు జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్. అతని జీవితం ఆధారంగా తెరకెక్కుతోంది ‘మేజర్’ చిత్రం. అడవి శేష్ టైటిల్ రోల్ పోషిస్తున్నఈ సినిమా టీజర్ ఉగాది కానుకగా సోమవారం సాయంత్రం విడుదలైంది. మేజర్ ఉన్ని కృష్ణన్ ఈ దేశం కోసం ఎలా ప్రాణాలు ధారపోశాడు అనేది కాకుండా… ఎలా ఈ దేశం కోసం జీవించాడు అనే దానిని ఈ చిత్రంలో చూపిస్తుండటం విశేషం. ముంబై 26/11 ఎపిసోడ్ ను అత్యంత ఉత్కంఠభరితంగా, రోమాంచితంగా వెండితెరపై ఆవిష్కరిస్తున్నాడు దర్శకుడు శశి కిరణ్ తిక్క. సోనీ పిక్చర్స్ తో పాటు మహేశ్ బాబు కు చెందిన జిఎంబి సంస్థ, ఎ ప్లస్ ఎస్ మూవీస్ సంయుక్తంగా ‘మేజర్’ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమాను మేజర్ ఉన్నికృష్ణన్ మాతృభాషైన మలయాళంలోనూ విడుదల చేయబోతున్నారు. శ్రీచరణ్ పాకాల దీనికి సంగీతం అందించారు.
ఏప్రిల్ 12న విడుదలైన 1.34 నిమిషాల ‘మేజర్’ టీజర్ ను చూడగానే గూజ్ బంబ్స్ రావడం ఖాయం. తాజ్ ప్యాలెస్ పై జరిగిన దాడిలో ఓ పక్క ప్రాణాలు కోల్పోతూ కూడా సందీప్ ఉన్నికృష్ణన్ ఎలా ఉగ్రవాదులకు సింహస్వప్నంగా నిలిచాడనేది ఛాయామాత్రంగా ఇందులో చూపించారు. ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించిన ప్రకాశ్ రాజ్, రేవతి, శోభిత దూళిపాల, సాయి మంజ్రేకర్, మురళీశర్మ కూడా ఈ టీజర్ లో కనిపిస్తారు. దేశభక్తి అంటే ఏమిటో చెప్పిన విధానం బాగుంది. ‘దేశాన్ని ప్రేమించడం అందరి పని. వాళ్ళను కాపాడుకోవడం సోల్జర్ పని’ అంటూ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్ర ద్వారా చెప్పించడం అద్భుతం. సరిహద్దుల్లో శత్రు దేశ సైనికులతో యుద్ధం చేయడమే కాదు, దేశం లోపలకు వచ్చేసిన టెర్రిస్టులను అరికట్టడం కోసం కూడా మన సోల్జర్స్ ప్రాణాలు అర్పించాల్సి రావడం బాధాకరం. ఈ అంశాలపై గతంలో కొన్ని సినిమాలు వచ్చినా… ‘మేజర్’ వాటికి భిన్నమైన చిత్రం అని ఈ టీజర్ చూస్తుంటే అర్థమౌతోంది. అన్ని అనుకున్నట్టు జరిగితే ‘మేజర్’ జులై 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాలి. కానీ ఈ టీజర్ లో ఎక్కడా విడుదల తేదీని మాత్రం ప్రస్తావించలేదు!
Also Read
- The Paradise : నాని 'ది ప్యారడైజ్' బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
- Varanasi : 'వారణాసి'లో తన షూటింగ్ పార్ట్ పూర్తి చేసిన మహేశ్ బాబు
- CM Reply: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ‘ది పారడైజ్’ చూడాలన్న నాని.. సీఎం రేవంత్ రిప్లై ఇదే.!
- TheParadise Premiere : నో కట్స్, నో బీప్స్.. ఓవర్సీస్లో నేడే 'ది ప్యారడైజ్' ప్రీమియర్లు!
తాజావార్తలు
-
Bajaj Wego C90: చిన్న వ్యాపారులకు Bajaj Wego C90 ఎలక్ట్రిక్ కార్గో.. 207KM రేంజ్.. 12.1kWh బ్యాటరీ
-
The Paradise : నాని ‘ది ప్యారడైజ్’ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
ECI on SIR Row: ఓటర్ల జాబితా SIRపై రగడ.. అంతర్గత విభేదాల వార్తలను తోసిపుచ్చిన ఈసీ
-
NIMS Doctor Lakshmi Bhaskar: ఫ్లాట్లు, బంగారం, పెట్టుబడులు.. డాక్టర్ లక్ష్మీ భాస్కర్ రూ.100 కోట్ల ఆస్తులు గుర్తించిన ఏసీబీ..!
ట్రెండింగ్
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!