ముగ్గురు స్టార్ హీరోలు రిలీజ్ చేయనున్న ‘మేజర్’ టీజర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టాలెంటెడ్ హీరో అడవిశేష్ హీరోగా, శోభిత ధూళిపాళ్ల, సయీ మంజ్రేకర్ హీరోయిన్లుగా నటిస్తున్న ప్రతిష్టాత్మకమైన మూవీ ‘మేజర్’. ఈ చిత్రంలో శోభిత ప్రమోద అనే పాత్రలో నటిస్తున్నారు. అడవిశేష్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. 26/11 ముంబై తీవ్రవాద దాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు ‘మేజర్’ టీజర్ ను విడుదల చేయనున్నారు. అయితే ముగ్గురు స్టార్ హీరోల చేతుల మీదుగా ‘మేజర్’ టీజర్ రిలీజ్ కానుంది. ‘మేజర్’ టీజర్ ను తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేస్తుండగా… హిందీలో కండలవీరుడు సల్మాన్ ఖాన్, మలయాళంలో మలయాళ సూపర్ స్టార్ పృథ్వీ రాజ్ సుకుమారన్ రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. మూడు భాషల్లో ముగ్గురు స్టార్ హీరోల చేతుల మీదుగా ‘మేజర్’ టీజర్ రిలీజ్ అయితే సినిమాపై అంచనాలు తప్పకుండా ఆకాశాన్ని అంటుతాయి. ఇప్పటికే ఈ మూవీ నిర్మాణంలో సూపర్ స్టార్ మహేష్ బాబు భాగం కావడంతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. సోనీ పిక్చర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. కాగా ‘మేజర్’ చిత్రాన్ని జూలై 2న తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు మేకర్స్.
Also Read
- Jabardasth Mahesh: ‘ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో తెలీదు’.. సడన్‌గా కమెడియన్ మహేష్ షాకింగ్ వీడియో.. అసలేమైంది?
- Isakapatnam Trailer: అధికారం కోసం కన్నతండ్రినే ఢీకొట్టిన కూతురు!"
- Maa Inti Bangaram : సమంత ‘గోల్డెన్ రన్’.. 17 లక్షలకు పైగా టికెట్లతో ‘మా ఇంటి బంగారం’ సరికొత్త రికార్డ్!
- NBK 112: కొరటాల సినిమా కోసం రూల్స్ బ్రేక్ చేసిన బాలయ్య
తాజావార్తలు
-
Maa Inti Bangaram: వైజాగ్ సక్సెస్ మీట్లో బిగ్ సర్ప్రైజ్.. ‘మా ఇంటి బంగారం 2’ అధికారికంగా ప్రకటించిన రాజ్
-
US Airstrikes on Iran: మధ్యప్రాచ్యంలో మళ్లీ యుద్ధ మేఘాలు.. ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడులు
-
Astrology: జూన్ 27 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
-
Astrology: ఈ 3 రాశులవారు ఒంటరిగా ఉండటాన్నే ఎక్కువ ఇష్టపడతారా? జ్యోతిష్యం ఏమి చెబుతోంది?
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!