పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండు పతకాలు సాధించిన మను భాకర్ ఈ ఏడాది ఖేల్ రత్న అవార్డుకు నామినేట్ కాలేదని వార్తలు వస్తున్నాయి. ఇదే ఇప్పుడు క్రీడావర్గంలో తీవ్ర చర్చకు దారితీసింది. మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డు నామినీల జాబితాలో డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ మనుభాకర్ పేరు తొలగించినట్లు సమాచారం. కమిటీ ఆమె పేరును రికమెండ్ చేయలేదని తెలిసింది.
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ప్రతి ఏటా జరిగే జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రతిష్టాత్మక అవార్డులను బహుకరించారు. క్రీడల్లో అత్యున్నత పురస్కారమైన ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డును టేబుల్ టెన్నిస్ లెజెండ్ అచంట శరత్ కమల్ అందుకోగా.. అర్జున అవార్డును 25 మంది క్రీడాకారులు స్వీకరించారు.
భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్‌కు ఖేల్ రత్న అవార్డు వచ్చింది. ఈ ఏడాది జూన్‌లో బీసీసీఐ అవార్డులకోసం సిఫార్సు చేసిన క్రికెటర్లలో మిథాలీ కూడా ఉంది. అయితే భారతదేశంలోని మహిళా క్రికెటర్లకు రోల్ మోడల్ గా మిథాలీ రాజ్ మారింది అని చెప్పచు. ఇక 22 ఏళ్లుగా అంతర్జాతీయ క్రికెట్ లో కొనసాగుతున్న మిథాలీ రాజ్ తన కెరీర్‌లో ఇప్పటివరకు 11 టెస్టులు, 215 వన్డేలు, 89 టీ20ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. అందులో మిథాలీ…
క్రీడాకారులకు ఇచ్చే అత్యుత్తమ పురస్కారమైన రాజీవ్ ఖేల్‌రత్న పేరును మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న పురస్కారంగా మార్చినట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోడీ.. అయితే, ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ నేతలు తప్పుబడుతున్నారు.. ఈ వ్యవహారంపై స్పందించిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు… రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పేరును మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా మార్చడం దుర్మార్గం అన్నారు.. గాంధీ కుటుంబంపై ఉన్న కక్షతోనే పేరు మార్చారని…
రాజీవ్ ఖేల్ రత్న అవార్డ్ పేరు మార్చేసింది కేంద్ర ప్రభుత్వం.. క్రీడాకారులకు ఇచ్చే అత్యుత్తమ పురస్కారమైన రాజీవ్ ఖేల్‌రత్న పేరును మార్చినట్టు ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.. ఇప్పటి వరకు రాజీవ్ ఖేల్‌రత్నగా ఉన్న పేరును మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న పురస్కారంగా మార్చినట్టు పేర్కొన్నారు ప్రధాని మోడీ.. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు వారి మనోభావాలను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కాగా, ఖేల్ రత్న…