రాజీవ్ ఖేల్ రత్న అవార్డ్ పేరు మార్చేసింది కేంద్ర ప్రభుత్వం.. క్రీడాకారులకు ఇచ్చే అత్యుత్తమ పురస్కారమైన రాజీవ్ ఖేల్‌రత్న పేరును మార్చినట్టు ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.. ఇప్పటి వరకు రాజీవ్ ఖేల్‌రత్నగా ఉన్న పేరును మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న పురస్కారంగా మార్చినట్టు పేర్కొన్నారు ప్రధాని మోడీ.. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు వారి మనోభావాలను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
కాగా, ఖేల్ రత్న అవార్డును 1991-1992లో స్థాపించింది ప్రభుత్వం… ఈ అవార్డును చెస్ లెజెండ్ విశ్వనాథన్ ఆనంద్ మొదట అందుకున్నారు.. ఇక, లియాండర్ పేస్, సచిన్ టెండూల్కర్, ధనరాజ్ పిళ్లై, పుల్లెల గోపీచంద్, అభినవ్ బింద్రా, అంజు బాబీ జార్జ్, మేరీ కోమ్, రాణి రాంపాల్ ను కూడా ఈ అవార్డు వరిచింది.. ఇప్పుడు రాజీవ్ ఖేల్ రత్న అవార్డును మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా మార్చింది ప్రభుత్వం.. ఈ అవార్డుతో పాటు అవార్డు గ్రహీతలకు రూ. 25 లక్షల నగదు బహుమతి అందిస్తూ వస్తుంది ప్రభుత్వం.. ఇక, ది విజార్డ్ అని పిలవబడే, మేజర్ ధ్యాన్ చంద్.. ఫీల్డ్ హాకీ ప్లేయర్, 1926 నుండి 1949 వరకు అంతర్జాతీయ హాకీ ఆడారు.. అతని కెరీర్‌లో 400 గోల్స్ చేశాడు. అలహాబాద్‌లో జన్మించిన ధ్యాన్ చంద్, 1928, 1932 మరియు 1936 లలో బంగారు పతకాలు సాధించిన ఒలింపిక్ జట్టులో భాగంగా ఉన్నారు. ఢిల్లీలోని నేషనల్ స్టేడియం 2002లో ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియం అని పేరు మార్చబడింది.