భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్‌కు ఖేల్ రత్న అవార్డు వచ్చింది. ఈ ఏడాది జూన్‌లో బీసీసీఐ అవార్డులకోసం సిఫార్సు చేసిన క్రికెటర్లలో మిథాలీ కూడా ఉంది. అయితే భారతదేశంలోని మహిళా క్రికెటర్లకు రోల్ మోడల్ గా మిథాలీ రాజ్ మారింది అని చెప్పచు. ఇక 22 ఏళ్లుగా అంతర్జాతీయ క్రికెట్ లో కొనసాగుతున్న మిథాలీ రాజ్ తన కెరీర్‌లో ఇప్పటివరకు 11 టెస్టులు, 215 వన్డేలు, 89 టీ20ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. అందులో మిథాలీ రాజ్ 8 సెంచరీలు మరియు 77 హాఫ్ సెంచరీలతో సహా ఫార్మాట్లలో కలిపి 10,203 పరుగులు చేసింది. అయితే అంతర్జాతీయ క్రికెట్ అత్యధిక కెరియర్ కలిగి ఉన్న మహిళా క్రికెటర్ గా మిథాలీ రాజ్ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఇక పురుషుల క్రికెట్ లో శిఖర్ ధావన్ కు అర్జున అవార్డు వచ్చింది.