డిసెంబర్ నెలలో మహీంద్రా వాహనాలకు విపరీతమైన డిమాండ్ కనిపించింది. కంపెనీ ఇచ్చిన సమాచారం ప్రకారం.. డిసెంబర్ 2024 నెలలో 69768 వాహనాలు అమ్ముడయ్యాయి. ఎగుమతులతో కలిపి 16% పెరుగుదల నమోదు చేసింది. మహీంద్రా దేశీయ మార్కెట్‌లో 41424 ఎస్‌యూవీ వాహనాలను విక్రయించింది. ఇందులో 18% వృద్ధిని సాధించింది. 19502 వాహనాలకు విదేశాలకు ఎగుమతి చేసింది.
న్యూ ఇయర్ తర్వాత కారు కొనాలకునే వారికి బ్యాడ్ న్యూస్.. ఎందుకంటే కార్ల కంపెనీలు జనవరి నుంచి ధరలు పెంచాయి. మారుతీ, హ్యుందాయ్, టాటా, మహీంద్రా, స్కోడా, ఫోక్స్‌వ్యాగన్, ఎంజీ, నిస్సాన్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటికే బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్, ఆడి, వోల్వో కంపెనీలు కూడా రేట్లు పెంచుతున్నట్లు వెల్లడించాయి. ఏయే కార్ల కంపెనీలు తమ కార్ల ధరలను పెంచాయో ఒకసారి చూద్దాం.
ప్రముఖ దేశీయ వాహన తయారీ సంస్థ ‘మహీంద్రా అండ్ మహీంద్రా’కు చెందిన మూడు వాహనాలు భారత్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో 5 స్టార్ రేటింగ్ సాధించాయి. మహీంద్రా థార్ రాక్స్, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ, మహీంద్రా ఎక్స్‌యూవీ 400లు 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించాయి. మహీంద్రా అండ్ మహీంద్రా ప్రస్తుతం వాల్యూమ్ పరంగా భారతదేశంలో అతిపెద్ద ఎస్‌యూవీ తయారీదారుగా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో ఎక్స్‌యూవీ 700, థార్‌లు ఎక్కువగా సేల్ అవుతున్నాయి. భారత్…
స్టాక్ బ్రోకింగ్ కంపెనీ జెరోధా వ్యవస్థాపకుడు నితిన్ కామత్ గురించి తెలిసే ఉంటుంది. జెరోధా సీఈఓ నితిన్ కామత్‌కు ఇటీవల బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో యువర్‌స్టోరీ వ్యవస్థాపకురాలు శ్రద్ధా శర్మ ఓ ప్రశ్న సంధించారు.
Mahindra Thar ROXX Bookings: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ ‘మహీంద్రా అండ్ మహీంద్రా’ ఇటీవల 5 డోర్ మహీంద్రా థార్ రాక్స్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఆన్‌లైన్ బుకింగ్‌లు ప్రారంభం కాకముందే ఈ కారుకు ఫుల్ క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం ఆన్‌లైన్ బుకింగ్‌ల కోసం చాలామంది వెలయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికి ఓ శుభవార్త. అక్టోబర్ 3న ఉదయం 11 గంటలకు థార్ రాక్స్ ఆన్‌లైన్ బుకింగ్‌లు ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని కంపెనీ తన…
Mahindra Thar Roxx 4x4 Price: మహీంద్రా థార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాని రోడ్ అప్పియరెన్స్‌తో ఎంతో మందికి ఇది డ్రీమ్ ఆఫ్‌రోడర్‌గా మారింది. ఇటీవల థార్ రాక్స్ పేరుతో మహీంద్రా 5-డోర్ వెర్షన్‌ని తీసుకువచ్చింది. అయితే, ఇటీవల థార్ రాక్స్ ఇటీవల ఇండియన్ మార్కెట్‌లోకి రిలీజ్ అయింది. ఆ సమయంలో కేవలం రేర్ వీల్ డ్రైవ్(RWD) ధరలు మాత్రమే వెల్లడించారు.
Mahindra: మహీంద్రా ఎస్‌యూవీలకు బలమైన డిమాండ్ కొనసాగుతోంది. కంపెనీ ఫోర్ట్‌పోలియోలోని కొత్త XUV 3XO, బొలెరో, థార్, స్కార్పియో (N మరియు క్లాసిక్) మరియు XUV700లకు భారీ డిమాండ్ నెలకొంది.
ఈ ఏడాది జనవరి నుంచి దేశంలోని అన్ని ఆటోమొబైల్ కంపెనీలు కార్ల ధరలను పెంచాయి. కానీ, ఇప్పుడు కార్లపై భారీ డిస్కౌంట్లు ఇవ్వబోతున్నారు. మీరు కొత్త కారు కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, ఇది మీకు గొప్ప అవకాశం.
Mahindra XUV 3XO: ఎన్నో రోజుల నుంచి కస్టమర్లను ఊరిస్తున్న మహీంద్రా XUV 3OO ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ మహీంద్రా XUV 3XO ఈ రోజు లాంచ్ అయింది. గతంతో పోలిస్తే మరింత స్టైలిష్ లుక్స్‌తో, మరిన్ని టెక్ ఫీచర్లతో ఈ కార్ వచ్చింది. తొలిసారిగా కాంపాక్ట్ SUV సెగ్మెంట్లో పనోరమిక్ సన్‌రూఫ్, లెవల్-2 ADAS ఫీచర్లని అందిస్తోంది. టాటా నెక్సాన్, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, నిస్సాన్ మాగ్నైట్, రెనో కిగర్‌లకు మహీంద్రా XUV 3XO ప్రత్యర్థిగా…