Mahesh Kumar Goud : ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు పట్టాలు మార్పించారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హరీష్ రావు వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల సహకారంతోటే యథేచ్ఛగా చెరువులు కబ్జాలకు గురైనవి అని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందే భూములు కబ్జా చేయడానికి అని ఆయన మండిపడ్డారు. పది ఏండ్లలో బీఆర్ఎస్ నాయకులు యథేచ్ఛగా ప్రభుత్వ భూములు,111, ఎఫ్టిల్, బఫర్ జోన్ భూములన్ని కబ్జా చేసిండ్రు అని ఆయన విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు పట్టాలు మార్పించారని, దురాక్రమనకు గురైన ప్రభుత్వ భూములను ఇంచు వదలకుండా కాపాడడానికి సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాతో ముందుకు పోతున్నారని, ఇవాళ హరీష్ రావు, కేటీఆర్ మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితులలో లేరని ఆయన అన్నారు.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీకి పాకిస్తాన్ ఆహ్వానం..!
Also Read
బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ఎన్ కన్వెన్షన్ అక్రమంగా కడితే… హరీష్ రావు ఎన్ కన్వెన్షన్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. మీరు ఎందుకు కాళ్ళు, చేతులు ముడుచుక కూర్చున్నారని, పది ఏళ్లలో హైదరాబాద్ చుట్టుపక్కల చెరువులు, కుంటలు ఆక్రమించుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, నాయకులు ఎంతమంది అని ఆయన అన్నారు. చట్టానికి చుట్టాలు లేరని, ఎవరైనా చూసేది లేదు ఎంత పెద్ద వారిని అయినా వదిలేదిలేదన్నారు మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్ నాయకులవి కూడా కూలగోడుతున్నారని, దూర దృష్టితో దురాక్రమనకు గురైన చెరువులు కుంటలను కాపాడడానికి సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా ను తీసుకొచ్చారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి హైడ్రా అధికారులకు అభినందనలు తెలిపారు మహేష్ కుమార్ గౌడ్.
APOLLO-BROEC: అపోలో మెడ్‌స్కిల్స్‌తో చేతులు కలిపిన బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ కన్సల్టెంట్..
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?