ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా లో ఇంజనీరింగ్ , లా కాలేజీలకు మంజూరైనున్నట్లు చిన్నారెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల విద్యాభివృద్ధి కోసం ఈ జిల్లాకు చాలా మేలు చేకూరుతుందని ఆయన అభిప్రాయపడుతున్నారు.
సీఎం సొంత ఇలాఖా లో కాంగ్రెస్ కు ఓటర్లు షాక్ ఇచ్చారు. మహబూబ్ నగర్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ఘన విజయం సాధించారు. 4,500 ఓట్ల మెజార్టీతో డీకే అరుణ విజయ దుందుభి మోగించారు. సర్వ శక్తులు ఒడ్డీనా వంశీ చంద్ రెడ్డి గెలుపు తీరాలకు చేరలేదు.
Mahaboobnagar: చికెన్ గున్యా కేసులు నగరంలో వేగంగా పెరుగుతున్నాయి. మారుతున్న వాతావరణం, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అకాల వర్షాల కారణంగా ఈ అంటువ్యాధుల కేసులు ప్రబలుతున్నాయి చికెన్ గున్యా పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యశాఖ పేర్కొంది.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. అక్టోబర్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించాల్సి ఉండగా.. అంతకు ముందే.. అనగా.. సెప్టెంబర్ 30వ తారీఖున ఆయన తెలంగాణకు వస్తున్నారు.
Kalti Kallu: మహబూబ్ నగర్ జిల్లాలో కల్తీ కల్లు బాధితులు, మృతుల సంఖ్య పెరుగుతుండటం కలకలం రేపుతోంది. జిల్లా ఆస్పత్రికి కల్తీ కల్లు బాధితులు క్యూ కడుతూనే ఉన్నారు. సుమారు ఆరు రోజులుగా బాధితులకు చికిత్స కొనసాగుతూనే ఉంది. 40 మందికిపైగా బాధితులు ఆస్పత్రిలో చేరగా… వారిలో ఇప్పటివరకు ముగ్గురు మృతి చెందారు. చనిపోయినవారిలో కోడూరుకు చెందిన అంజయ్య, అంబేద్కర్‌నగర్‌కు చెందిన విష్ణుతోపాటు మరొకరు ఉన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అయితే,…
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణలోనూ మూడు రోజుల పాటు అన్ని రకాల మద్యం షాపులు మూతపడనున్నాయి.. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఈ మూడు జిల్లాల్లో మద్యం దుకాణాలు మూసివేయనున్నారు.. ఈనెల 11వ తేదీన సాయంత్రం 4 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు వైన్స్‌లు మూసేయాలని ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు అతిక్రమించిన వైన్స్‌లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది తెలంగాణ ఎక్సైజ్ శాఖ..…
నగరంలోని మెట్రో స్టేషన్ పై నుండి దూకి ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ఇవాళ హైదరాబాద్ నగరంలోని ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ పై నుండి దూకి బుధవారం ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది.
ఇవాళ ఉదయం జూబ్లీహిల్స్, మణికొండ, సికింద్రాబాద్, కూకట్ పల్లి, లక్డీకపూల్, మెహిదీపట్నంలో భారీ వర్షం కురిసింది. కుండపోత వర్షం కారణంగా నగర పరిసరాలు జలమయమయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా ఉదయం పూట పరిశ్రమలు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.