Mahbubnagar: ఇంద్రియాలను తన ఆధీనంలో ఉంచుకున్నవాడు ఈ ప్రపంచంలో ఎక్కడైనా ప్రశాంతంగా జీవిస్తాడు. అలాకాకుండా పరస్త్రీకి ఆకర్షితులైతే ఆపైన జరిగే అనర్ధాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలా కొందరు మహిళలు బాడాబాబులను ట్రాప్ చేసి ఆపైన వాళ్ళను బ్లాక్ మెయిల్ చేసి నిలువునా ముంచిన ఘటనలు గతంలో కోకొల్లలు. అలాంటి ఘటనే తాజాగా మహబూబ్ నగర్ జిల్లా లో వెలుగు చూసింది. ఓ మహిళ పన్నిన హని ట్రాప్ లో ఓ పోలీస్ అధికారి చిక్కుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ కానిస్టేబుల్ పన్నిన ఉచ్చులో ఓ పోలీస్ అధికారి చిక్కుకున్నాడు. ఆ మహిళ కానిస్టేబుల్ హని ట్రాప్ చేస్తుంది అని గ్రహించలేని అధికారి ఆ మహిళ దగ్గర అడ్డంగా బూక్ అయ్యారు.
Read also:Asaduddin Owaisi: యూపీఏకు మద్దతు ఇవ్వడానికి ఎంత డబ్బు తీసుకున్నారు.. రాహుల్ కు అసదుద్దీన్ కౌంటర్
మహిళ కానిస్టేబుల్ అనుకున్నది అనుకున్నట్లు జరింగింది. ఈ నేపథ్యంలో ఆ మహిళ కానిస్టేబుల్ తన అసలు రంగు చూపింది. పోలీసు అధికారిని బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో ఆ అధికారి మహిళ కానిస్టేబుల్ బండారం బయట పెట్టేందుకు సిద్ధపడ్డారు. ఈ నేపధ్యంలో మహిళ కానిస్టేబుల్ తన భర్తతో కలిసి అధికారిని హతమార్చేందుకు ప్లాన్ చేసింది. అయితే ఆమె భర్త కూడా కనిసబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. దీనితో ఆ మహిళ కానిస్టేబుల్ ఆమె భర్త కలిసి అధికారి పైన హత్యయత్నం చేసారు. భర్తతో కలిసి సీఐ మర్మాంగాలను కోసింది మహిళ కానిస్టేబుల్. ఇది గమనించిన స్థానిక పోలీసులు సీఐ ను ఆసుపత్రికి తరలించారు. కాగా పోలీసు అధికారి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. అయితే ఆ మహిళ కానిస్టేబుల్ గతంలో కూడా ఓ పోలీస్ ఉన్నతాధికరిని బ్లాక్ మెయిల్ చేసినట్లు సమాచారం.