టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ పై ఘాటు విమర్శలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. మహబూబ్ నగర్ పర్యటనలో ఉన్న ఆయన కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోవటం..బీజేపీ గెలువటం ఖాయమని జోస్యం చెప్పారు. ఒకసారి టీఆర్ఎస్ ఓడిపోతే మళ్లీ గెలిచే అవకాశం లేదని స్పష్టం చేశారు. గోల్ మాల్ చేయాలనుకున్నప్పుడు..ప్రజలను తప్పుదోవ పట్టించాలన్నప్పుడు కేసీఆర్ మీడియా ముందుకు వస్తాడని విమర్శించారు. కేసీఆర్ కు నేను..నా కుటుంబమనే ఆహం పెరిగిందని అన్నారు.…
పసుపు కండువా నీడలోనే నేతలు ఉమ్మడి మహబూబ్‍నగర్ జిల్లాలో తెలుగుదేశంపార్టీలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన నేతలు ప్రస్తుతం ముగ్గురు నలుగురే ఉన్నారు. వారిలో ఒకరు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు బక్కని నర్సింహులు. మిగతా వాళ్లు మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి.. కొత్తకోట దయాకర్‌రెడ్డి దంపతులు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత టీడీపీలో క్రియాశీలకంగా పనిచేసిన వారంతా వివిధ పార్టీల్లోకి వెళ్లిపోయారు. వీళ్లు మాత్రం పసుపు కండువా నీడలోనే కాలం వెళ్లదీస్తున్నారు. బక్కని నర్సింహులు టీ టీడీపీ…
పాలమూరు సభలో రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పాలమూరు నుంచి 14 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించి… ఈ రాష్ట్రం తలరాత మార్చే అవకాశం తనకు ఇవ్వాలని కోరారు. లక్షా 93 వేల ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశం ఇవ్వాలని.. 4 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు ఇచ్చే అవకాశం ఇవ్వాలని అన్నారు. అలాగే, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసే అవకాశం ఇవ్వాలని కోరారు రేవంత్ రెడ్డి. మరోవైపు, పరాయి రాష్ట్రం ప్రాజెక్టులపై దృష్టిపెడితే.. ఇక్కడే ఏడేళ్లుగా…