Shocking Video: మహారాష్ట్రలోని థానే జిల్లా అంబర్‌నాథ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. పాత కక్షల నేపథ్యంలో ఎనిమిది మంది గ్యాంగ్ సభ్యులు సుధీర్ ఓంప్రకాశ్ సింగ్ అనే వ్యక్తిపై కత్తులు, కొడవళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. బాధితుడు సుధీర్ సింగ్ తన కారులో విరిగిన భాగాన్ని రిపేర్ చేయించుకోవడం కోసం సమీపంలోని ఆటోమొబైల్ రిపేర్ షాప్ (గ్యారేజ్) వద్దకు వెళ్లారు. అదే సమయంలో అతడిని వ్యక్తులు చుట్టుముట్టారు. ఇక సీసీటీవీ ఫుటేజ్ ను గమనించినట్లయితే.. సుధీర్ సింగ్ వారి నుండి తప్పించుకోవడానికి వర్క్‌షాప్‌లోకి పరిగెత్తి, తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తూ ఒక ఐరన్ కడ్డీని అందుకున్నాడు.
Egg, Vegetable Prices: భారీగా పెరిగిన గుడ్ల ధరలు.. డజను కోడి గుడ్లు ఎంతంటే..
దానిని గమనించి ఆయుధాలతో ఉన్న ఐదుగురు వ్యక్తులు ఒకరి తర్వాత ఒకరు షాప్‌లోకి ప్రవేశించి అతనిపై దాడి చేయడం ప్రారంభించారు. వారిలో ఒకరు నేలపై ఉన్న చిన్న స్టూల్‌ను తీసి సుధీర్‌పై విసిరాడు. మిగతావారు కత్తులు, కొడవళ్లతో విచక్షణారహితంగా కొట్టారు. దాడి నుండి రక్షించుకోవడానికి సుధీర్ షాప్‌లోని ఒక మూలలో తలదాచుకోవడానికి ప్రయత్నించగా.. దాడి చేసినవారు అతన్ని వదలకుండా నేలపై పడేసి, దాదాపు ఒకటిన్నర నిమిషం పాటు నిర్విరామంగా కొట్టారు. దాడి చేసిన తర్వాత వారిలో ఒకరు మిగిలిన వారిని బయటకు వెళ్లమని చెప్పగా.. వెళ్లేముందు వారు సుధీర్ స్కూటర్‌ను ధ్వంసం చేసి, మోటార్‌బైక్‌లపై అక్కడి నుండి పారిపోయారు.
iBomma: పైరసీ నష్టం సరే.. మరి సినీ పెద్దల దోపిడీ సంగతేంటి?
ఈ దాడిలో సుధీర్ వీపు, చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని వెంటనే ఉల్హాస్ నగర్ లోని సెంట్రల్ హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనపై అంబర్‌నాథ్ వెస్ట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుల గ్యాంగ్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
🔥 AMBERNATH SHOCKER 🔥
A young man, Sudhir Omprakash Singh, was brutally attacked by an 8–9 member gang armed with swords & choppers in Jawasai area!
The attackers came on bikes, struck with the intent to kill, and even smashed his motorcycle before fleeing. 😱⚔️
Sudhir, badly… pic.twitter.com/T8frk5Q3ag— Hathoda Post (@HathodaPost) November 18, 2025