AP High Court: ఎల్పీజీని అంతర్జాతీయ మార్కెట్లో అమ్మడానికి వీల్లేదు!
- యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా వంట గ్యాస్ కొరత
- వంట గ్యాస్ కొరత నేపథ్యంలో హైకోర్టు కీలక ఆదేశాలు
- ఎల్పీజీని అంతర్జాతీయ మార్కెట్లో అమ్మడానికి వీల్లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా వంట గ్యాస్ కొరత ఏర్పడిన నేపథ్యంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. చమురు శుద్ధి సంస్థలు ఎల్పీజీని అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు కాన్ఫిడెన్స్ పెట్రోలియం ఇండియా లిమిటెడ్‌కు ఆదేశాలు జారీ చేసింది. దేశంలో ఎల్పీజీ కొరత ఉన్న సమయంలో చమురు శుద్ధి సంస్థలు అంతర్జాతీయ మార్కెట్లో విక్రయాలకు పాల్పడితే.. అది సామాన్య ప్రజలకు తీరని నష్టంతో పాటు కష్టాలను కలిగిస్తుందని కోర్టు స్పష్టం చేసింది. వినియోగదారులకు వంట గ్యాస్ సరఫరా చేసేందుకు వీలుగా గ్యాస్ను పంపిణీదారులకు మాత్రమే సరఫరా చేయాలని ఆదేశించింది.
Also Read: Today Astrology: శుక్రవారం దిన ఫలాలు.. ఈ రాశుల వారికి ధనయోగం పక్కా!
Also Read
- CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
దేశంలోని చమురు శుద్ధి కర్మాగారాలు ప్రొపేన్, బ్యూటేన్ నిల్వలను గరిష్టంగా ఎల్పీజీ ఉత్పత్తి కోసం ఉపయోగించడంతో పాటు ఉత్పత్తి చేసిన ఎల్పీజీని ప్రభుత్వ రంగ సంస్థలైన ఐఓసీఎల్, హెచ్పీసీఎల్, బీపీసీఎల్లకు అందుబాటులో ఉంచి.. దానిని కేవలం దేశీయ వినియోగదారులకు మాత్రమే సరఫరా చేయాలంటూ ఈ నెల 5న జారీ చేసిన స్వీయ ఉత్తర్వుల కఠిన అమలుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ వ్యవహారంలో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ, కాన్ఫిడెన్స్ పెట్రోలియం ఇండియా లిమిటెడ్లను ఆదేశించింది. ఇందులో భాగంగా వారికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 2కు వాయిదా వేసింది.
తాజావార్తలు
-
Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
-
Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
-
CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Rahul Gandhi’s SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
-
BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!