Dawood Ibrahim: ఎట్టకేలకు అమ్ముడైన అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఆస్తులు.. దక్కించుకున్నది ఎవరో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dawood Ibrahim: దశాబ్దాల నిరీక్షణ తర్వాత, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన పూర్వీకుల ఆస్తుల వేలం ప్రక్రియ ఎట్టకేలకు విజయవంతమైంది. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో ఉన్న దావూద్ కుటుంబానికి చెందిన నాలుగు వ్యవసాయ ప్లాట్లను ముంబైకి చెందిన ఒక వ్యక్తి అత్యధిక బిడ్‌తో దక్కించుకున్నారని అధికారులు తెలిపారు.
READ ALSO: Netanyahu: ఇరాన్ అణుశక్తిని నాశనం చేశాం.. పుకార్ల మధ్య నెతన్యాహు ప్రెస్‌మీట్
Also Read
- Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
వేలం వివరాలు ఇవే..
రత్నగిరి జిల్లాలోని ముంబాక్ గ్రామంలో ఉన్న ఈ నాలుగు భూములు గతంలో దావూద్ తల్లి అమీనా బీ పేరు మీద నమోదై ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ‘స్మగ్లర్లు & విదేశీ మారక ద్రవ్య మానిప్యులేటర్ల (ఆస్తి జప్తు) చట్టం’ కింద 2026 మార్చి 5న ఈ వేలాన్ని నిర్వహించింది. అత్యధిక బిడ్ వేసిన వ్యక్తి 2026 ఏప్రిల్ మొదటి వారం నాటికి పూర్తి మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. నిధుల జమ అనంతరం, సంబంధిత అధికారుల నుంచి తుది ఆమోదం పొందిన తర్వాతే ఆస్తి బదిలీ ప్రక్రియ పూర్తవుతుంది.
ముంబాక్ ప్లాట్లపై ఆసక్తి
ఈ వేలంలో ప్రధానంగా సర్వే నెం. 442 (పార్ట్ 13-బి) ప్లాట్ గురించి ఆసక్తికర చర్చ నడిచింది. దీని రిజర్వ్ ధర సుమారు రూ.9.41 లక్షలుగా నిర్ణయించగా, వేలంలో ఇది రూ.10 లక్షల మార్కును దాటింది. ఈ ప్లాట్ కోసం ముంబై, రత్నగిరి నుంచి ఇద్దరు బిడ్డర్లు పోటీ పడగా, మిగిలిన మూడు ప్లాట్లను ఒకే బిడ్డర్ దక్కించుకున్నారు.
ఇన్నాళ్లుగా ఎందుకు అమ్ముడవలేదంటే..
దావూద్ ఆస్తులను వేలం వేయడానికి గత కొన్నేళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, అవి పదేపదే విఫలమవుతూ వచ్చాయి. దావూద్ ఇబ్రహీం, అతని ముఠా (D-Company) భయంతో కొనుగోలుదారులు ముందుకు రావడానికి వెనుకాడారు. ఇదే సమయంలో గత నవంబర్ (2025)లో ప్రభుత్వం ధరను 30 శాతం తగ్గించినప్పటికీ ఎవరూ ఆసక్తి చూపలేదు. ఈ భూములు గ్రామీణ ప్రాంతాల్లో కేవలం వ్యవసాయానికి మాత్రమే పనికొచ్చేలా ఉండటంతో తక్షణ ఆర్థిక లాభం ఉండదని కొందరు భావించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ, ఎట్టకేలకు ఈ ఆస్తుల వేలం పూర్తి కావడంతో ప్రభుత్వ యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!