Maharashtra Governor: మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనకు రాజకీయ బాధ్యతల నుంచి వైదొలగాలని ఉందంటూ అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే తాను రాజీనాయ చేయబోతున్నట్లు ముంబయికి వచ్చిన ప్రధానికి తెలియజేశానంటూ ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. తాను అన్ని రాజకీయ పదవుల నుంచి వైదొలగాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. తన శేష జీవితం అంతా రాయడం చదవడంతో పాటు ఇతర కార్యకలాపాలతో గడపాలనేదే తన కోరిక అంటూ వెల్లడించారు. మహారాష్ట్ర వంటి గొప్ప రాష్ట్రానికి సేవలందించడం ఎంతో సంతోషాన్ని, గౌరవాన్ని ఇచ్చిందన్నారు.
Army Officer: శిక్షణా కేంద్రంలో ఆర్మీ అధికారి ఆత్మహత్య.. కారణమేంటంటే?
శనివారం ఈ మేరకు ఆయన ప్రకటనను విడుదల చేశారు. దీంతో 80 ఏళ్ల కోశ్యారీ తన గవర్నర్ పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం భగత్ సింగ్ కోశ్యారీ అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. 2019లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్‌తో తెల్లవారు జామునే ప్రమాణస్వీకారం చేయించడం, ఇటీవల కూడా మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీపై వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శల పాలయ్యారు. గతంలో మహావికాస్ అఘాడీ సంకీర్ణ ప్రభుత్వం నామినేట్ చేసిన 12 మంది ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను తిరస్కరించి వార్తల్లో నిలిచారు.
During the recent visit of the Hon'ble Prime Minister to Mumbai, I have conveyed to him my desire to be discharged of all political responsibilities and to spend the remainder of my life in reading, writing and other activities.
— Governor of Maharashtra (@maha_governor) January 23, 2023