Rahul Gandhi: కేంద్రం ఎన్నికల సంఘంపై శుక్రవారం రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్‌లో ‘‘ఎన్నికల దొంగతనానికి’’ ఎన్నికల సంఘం కుట్ర పన్నిందని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు బీహార్‌లో ఓటర్ల జాబితాను సవరించాలని ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని విమర్శించారు. అయితే, ఈసీ నిర్ణయాన్ని పలు పార్టీలు సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. అయితే, ఓటర్ల జాబితాను సవరించడం ఈసీ చట్టబద్ధమైన హక్కు అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
Devendra Fadnavis: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగినట్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆదివారం తీవ్ర విమర్శలు చేశారు. ‘‘రాహుల్ గాంధీని ప్రజలు తిరస్కరించినప్పటికి నుంచి ఆయన ప్రజాస్వామ్య ప్రక్రియను పదే పదే అవమానిస్తున్నారు’’ అని ఆరోపించారు.
Rahul Gandhi: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని మోసం చేశారంటూ ఆయన ఎక్స్‌లో రాశారు. ఈ ఏడాది జరగబోయే బీహార్ ఎన్నికల్లో కడా బీజేపీ రిగ్గింగ్ చేయాలని చూసతోందని ఆయన పేర్కొన్నారు. ‘‘ఎందుకంటే మహారాష్ట్ర మ్యాచ్ ఫిక్సింగ్ తర్వాత బీహార్ ఎన్నికలు వస్తున్నాయి, ఆపై బీజేపీ ఓడిపోయే చోట రిగ్గింగ్ చేస్తుంది’’ అని ఆయన…
Maharashtra Election Results: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి ‘‘మహాయుతి’’ సంచలన విజయం సాధించింది. రాష్ట్రంలోని మొత్తం 288 సీట్లకు గానూ ఏకంగా 233 సీట్లను కైవసం చేసుకుని తిరుగులేని ఆధిక్యం ప్రదర్శించింది. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష ఇండియా కూటమి( మహా వికాస్ అఘాడీ) కేవలం 49 సీట్లకు మాత్రమే పరిమితమైంది.
Kanhaiya Kumar: మహరాష్ట్ర ఎన్నికల్లో విమర్శలు ప్రతివిమర్శలు తారాస్థాయికి చేరాయి. తాజాగా కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ భార్య గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉపముఖ్యమంత్రి భార్య ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేస్తున్నప్పుడు ‘‘మతాన్ని రక్షించే’’ బాధ్యత ప్రజలపై ఎందుకు ఉండాలని ప్రశ్నించారు.
శీతాకాలంలో మహారాష్ట్ర ఎన్నికలు హీటు పెంచుతున్నాయి. అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఓ వైపు నామినేషన్లు.. ఇంకో వైపు ప్రచారాలు దూకుడుగా సాగిపోతున్నాయి. అయితే ఈసారి ఎన్నికల్లో పెద్ద పెద్ద ధనవంతులే పోటీ చేస్తున్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనం నమోదైంది. ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ బారామతి నుంచి పోటీ చేస్తుండగా, ఆయనపై శరద్ పవార్ మనవడు యుగేంద్ర పవార్ పోటీకి దిగాడు. యుగేంద్ర పవార్ ఎన్సీపీ (శరద్ పవార్) వర్గం నుంచి పోటీ చేస్తున్నాడు.
Uddhav Thackeray: ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పొత్తుల్లో ప్రధాన పార్టీలు బిజీగా ఉన్నాయి. ఇదిలా ఉంటే శివసేన( యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఈ రోజు సంచలన వ్యాఖ్యలు చేశారు.