సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ “గుడ్ లక్ సఖి” చిత్రంతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోవడం లేదు. దీంతో తెలుగులో ‘మహానటి’ తర్వాత కీర్తికి బ్లాక్‌బస్టర్ లేదని ఆమె అభిమానులు నిరాశకు గురవుతున్నారు. ఇదిలా ఉంటే ‘ఐరన్ లెగ్’ అనే బాధాకరమైన టైటిల్‌కి తాను కూడా బలి అయ్యానని కీర్తి సురేష్ చెప్పింది. ఆమె కెరీర్ ప్రారంభంలో ఇలా జరిగిందని కీర్తి తాజాగా వెల్లడించింది. Read Also…