ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహిస్తున్న మహా కుంభమేళాలో ఈరోజు చివరి రోజు. మహా కుంభమేళా ఫిబ్రవరి 26న మహా శివరాత్రి సందర్భంగా ముగుస్తుంది. ఇప్పటికే కోట్లాది మంది పవిత్ర స్నానాలు ఆచరించారు. మహా కుంభమేళా కారణంగా.. కుటుంబం నుంచి తప్పిపోయిన వాళ్లను సైతం కొంత మంది కలుసుకున్నారు. వారిలో ఒకరు కర్ణాటకలోని విజయపురానికి చెందిన రమేష్ చౌదరి. ఈయన 24 సంవత్సరాల తర్వాత మహా కుంభమేళా ద్వారా తన కుటుంబాన్ని తిరిగి కలిశాడు.
Mahakumbh 2025 : ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా ముగింపు దగ్గర పడింది. ఫిబ్రవరి 26న మహా శివరాత్రి నాడు జరిగే చివరి స్నానోత్సవమైన మహా కుంభమేళా సందర్భంగా జనసందోహాన్ని నిర్వహించడానికి, ఫిబ్రవరి 25 నుండి జాతర ప్రాంతం, నగరంలో వాహనాలు నిషేధిత జోన్ అమలు చేయబడుతుంది.
Man Kills wife: భార్యని నమ్మించి కుంభమేళకు తీసుకెళ్లిన భర్త, ఆమె గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. తన వివాహేతర సంబంధాన్ని దాచేందుకు పెద్ద కట్టుకథని అల్లాడు. చివరకు యూపీ పోలీసులు 48 గంటల్లో నిందితుడిని అరెస్ట్ చేసి, హత్యకు వెనక ఉన్న కారణాలను వెల్లడించారు. ఢిల్లీలోని త్రిలోక్ పురికి చెందిన ఒక జంట కుంభమేళ కోసం యూపీ ప్రయాగ్‌రాజ్‌కి వచ్చారు. అక్కడే ఒక హోమ్ స్టేలో బస చేశారు.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా ప్రపంచాన్ని ఆకర్షి్స్తోంది. కనీవిని ఎరుగని రీతిలో ప్రపంచనలుమూలల నుంచి భక్తులు కుంభమేళాలో పాల్గొంటున్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి గంగామాతకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇప్పటికే కోట్లాదిమంది పవిత్రస్నానాలు ఆచరించారు. మరో నాలుగు రోజులలో మహాకుంభమేళా ముగియనుంది. అయితే ఈ సారి జరుగుతున్న కుంభమేలా 144 ఏళ్లకు వచ్చే ఆధ్యాత్మిక కార్యక్రమం కావడంతో ఇందులో పాల్గొనాలని, త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించాలని చాలా మంది భావిస్తున్నారు. Also Read:Home Ministry:…
Mahakumbh 2025 : మహా కుంభమేళాకు రైళ్లలో వచ్చే, వెళ్ళే యాత్రికులకు సౌకర్యాలను న్యూఢిల్లీలోని రైల్ భవన్‌లో నిర్మించిన వార్ రూమ్ నుండి పర్యవేక్షిస్తున్నారు.
Mahakumbh 2025 : నిర్ణీత పార్కింగ్ స్థలాలు కాకుండా వివిధ ప్రదేశాలలో పార్క్ చేసిన 163 వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. దీనితో పాటు వాహన యజమానుల నుంచి నాలుగు లక్షల రూపాయలకు పైగా జరిమానా వసూలు చేశారు.
Mahakumbh 2025 : మహా కుంభమేళాకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఇప్పటివరకు 16 రోజుల్లో దాదాపు 15 కోట్ల మంది గంగానదిలో స్నానమాచరించారు. ఇప్పుడు అందరి దృష్టి నేటి మౌని అమావాస్య స్నానంపైనే ఉంది.
Maha Kumbha Mela: హిందువులు ఆధ్యాత్మిక కార్యక్రమం ‘‘మహా కుంభ మేళా’’కి వెళ్లే భక్తులను విమానయాన సంస్థలు దోచుకుంటున్నాయి. హిందువులు ఒక్కసారైన కుంభమేళకు వెళ్లాలని భావిస్తుంటారు. ఈ అవకాశాన్ని ఎయిర్‌లైనర్లు ఉపయోగించుకుంటున్నాయి.
Mallikarjun Kharge: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న ‘‘మహా కుంభమేళా’’పై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే వివాదాస్పద కామెంట్స్ చేవారు. గంగా నదిలో పుణ్యస్నానాలు చేస్తే పేదరికం పోతుందా..? అని బీజేపీ నేతల్ని ఆయన ప్రశ్నించారు. మధ్యప్రదేశ్ మోవ్‌లో జరుగుతున్న ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ ర్యాలీలో సోమవారం ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నాయకులు కెమెరాల కోసం స్నానాలు చేస్తున్నారని ఆరోపించారు.