Maha Kumbha Mela: కుంభమేళ భక్తుల్ని దోచుకుంటున్న విమాన సంస్థలు..
- మహా కుంభ మేళ భక్తుల్ని దోచుకుంటున్న విమాన సంస్థలు..
- వెళ్లి రావడానికి టికెట్ ధరలు రూ. 50000 కన్నా పైమాటే..
- చర్యలు తీసుకునేందుకు సిద్ధమైన డీజీసీఏ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maha Kumbha Mela: హిందువులు ఆధ్యాత్మిక కార్యక్రమం ‘‘మహా కుంభ మేళా’’కి వెళ్లే భక్తులను విమానయాన సంస్థలు దోచుకుంటున్నాయి. హిందువులు ఒక్కసారైన కుంభమేళకు వెళ్లాలని భావిస్తుంటారు. ఈ అవకాశాన్ని ఎయిర్‌లైనర్లు ఉపయోగించుకుంటున్నాయి. ప్రయాగ్‌రాజ్‌తో పాటు కుంభమేళకు సమీపంలో ఉన్న వారణాసి, లక్నో, అయోధ్యలకు టికెట్ ధరల్ని అమాంతంగా పెంచాయి. సామాన్యుడు ఈ టికెట్ల ధరల్ని చూసి, విమానం ఎక్కే పరిస్థితి లేదు. ఈ టికెట్ల రేట్ల కన్నా బ్యాంకాక్, మాల్దీవుల వంటి పర్యాటక ప్రదేశాలకు వెళ్లి వచ్చేందుకు టికెట్ రేట్లు చాలా తక్కువ ఉండటం గమనార్హం.
న్యూఢిల్లీ, కోల్‌కతా, బెంగళూర్, హైదరాబాద్, చెన్నై వంటి మెట్రో నగరాల నుంచి కుంభమేళాకు వెళ్లాలంటే ఒక్కోక్కరు సుమారుగా రూ. 30000 చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. రానుపోనూ ఖర్చులు ఒకరికి రూ. 50 వేల నుంచి రూ. 60 వేల వరకు ఉంటున్నాయి. మహాకుంభమేళలో కీలక పుణ్య స్నానాల రోజులైన మౌని అమావాస్య స్నాన్ (జనవరి 29), బసంత్ పంచమి (ఫిబ్రవరి 3), మాఘి పూర్ణిమ (ఫిబ్రవరి 12), మరియు మహాశివరాత్రి (ఫిబ్రవరి 26) వంటి రోజుల్లో టికెట్ ధరలు మరింత ఎక్కువగా ఉంటున్నాయి.
Also Read
- Smit Machchhar: ఆ టైమ్‌లో "హనుమాన్ చాలీసా" పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
- Vettri Payanam: మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం విస్తరణ.. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకూ వర్తింపు
- PM Modi: కెప్టెన్ స్మిత్ మఛార్కి ప్రధాని మోడీ ఫోన్.. ఆ భయానక ఘటనపై ఆరా..
- Jantar Mantar Protest 2026: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు.. పలువురు నిరసనకారులు అదుపులోకి
Read Also: Sangareddy: ప్రియుడి మోజులో పడి భర్తను హత్య చేయించిన భార్య..
విమానయాన సంస్థలు టికెట్ రేట్లను పెంచడంపై డీజీసీఏ(డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) స్పందించింది. మహా కుంభ మేళ సమయంలో ప్రయాగ్ రాజ్‌కి విమాన ఛార్జీలను హేతుబద్ధీకరించాలని కోరింది. పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా డీజీసీఏ జనవరిలో 81 అదనపు విమానాలను ఆమోదించింది. దేశవ్యాప్తంగా ప్రయాగ్‌రాజ్ ఎయిర్ కనెక్టివిటీ 132 విమానాలకు పెంచింది.
భక్తుల కోసం ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం భద్రత, సౌకర్యాలను, అనేక సంస్థలు దాతృత్వ సేవల్ని నిస్వార్థంగా చేస్తుంటే, విమానయాన సంస్థలు మాత్రం ప్రయాణికులను నిలువుదోపిడి చేస్తున్నాయని వీహెచ్‌పీ జాతీయ ప్రతినిధి వినోద్ బన్సాల్ విమర్శించారు.
హైదరాబాద్-ప్రయాగ్ రాజ్ రూట్‌లో టికెట్ ధర సుమారుగా రూ. 27 వేలు- రూ. 31 వేలుగా ఉంది. చెన్నై నుంచి ప్రయాగ్ రాజ్‌కి ఒక్క ఫ్లైట్ టికెట్ ధర సుమారుగా రూ. 21 వేలు-రూ. 32 వేలుగా ఉంది. బెంగళూర్ నుంచి కూడా ఇదే తరహా రేట్లు ఉన్నాయి. సాధారణంగా మామూలు రోజుల్లో ఒక్కో టికెట్ కేవలం రూ. 6000- రూ.8000 మధ్యలో ఉంటుంది. ఢిల్లీ నుంచి ఈ ధరలు రూ. 15 వేలు- రూ. 22 వేల మధ్యలో ఉన్నాయి. సాధారణ రోజుల్లో ఇది కేవలం రూ. 5000 ఉంటుంది.
తాజావార్తలు
-
Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
-
Smit Machchhar: ఆ టైమ్‌లో “హనుమాన్ చాలీసా” పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
-
Vettri Payanam: మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం విస్తరణ.. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకూ వర్తింపు
-
Anant Ambani in AP: నన్ను కూడా ఆంధ్ర బిడ్డగా భావించండి.. అనంత్ అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?