పార్లమెంట్ లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం రేవంత్ రెడ్డి తొలి లోక్‌సభ అభ్యర్థిని ప్రకటించారు. మహబూబ్‌నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్‌రెడ్డిని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. బుధవారం కోస్గి సభలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి.. భారీ మెజార్టీతో వంశీచంద్ రెడ్డిని గెలిపించాలని కోరారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. వంశీచంద్ రెడ్డిని ఆశీర్వదించాలని కోరారు. కొడంగల్ లో 50 వేలు తగ్గకుండా ఆపై మెజార్టీ ఇవ్వాలని కోరారు.